మీకు కారు , ఇతర వాహనాలు ఉన్నాయా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్స్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. అందుకే కేంద్రం వీటిని ఇప్పుడు ఉచితంగానే ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. మోదీ ప్రభుత్వం వాహనదారుల టోల్ కష్టాలను తొలగించేందుకు సిద్ధమైంది. అందుకోసమే కొత్త రూల్స్ ను తీసుకుని రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం.  ఫాస్టాగ్స్‌ను తప్పనిసరి చేసింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది. దీంతో జాతీయ రహదారులపై వెళ్లే కార్లు, బస్సులు సహా ఇతర వాహనాలు కచ్చితంగా ఫాస్టాగ్స్‌ను కలిగి ఉండాలి అని తెలిపింది.

 

 

ఈ ఫాస్టాగ్స్ ఉండడం వల్ల టోల్ ప్లాజాల వద్ద నిలుచో వలసిన అవసరం లేదు. టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గానే కట్ అవ్వడం జరుగుతుంది. దీంతో మీరు వాహనాన్ని నిలిపి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆగకుండా డైరెక్ట్‌గా ముందుకు వెళ్లిపోవచ్చు. వాహనం అద్దంపై ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్‌ ద్వారా టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌ నుంచి డబ్బులు కట్ అవుతాయి.

 

ఇప్పుడు వాహనదారులకు కేంద్రం మరో తీపికబురు ఇచ్చింది. నవంబర్ 22 నుంచి అంటే ఈ రోజు నుంచి టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్స్‌ను ఉచితంగా పొందొచ్చని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి తెలియచేయడం జరిగింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ఫాస్టాగ్స్‌ను ఉచితంగా అందిస్తుందని తెలిపారు. డిసెంబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలియచేయడం జరిగింది.

 

ఆర్‌టీవో ఆఫీసులు, ట్రాన్స్‌పోర్ట్ హబ్స్‌లో కూడా ఫాస్టాగ్స్‌ను ఉచితంగానే పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక ఫాస్టాగ్స్ వెచ్చించే రూ.150 సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎన్‌హెచ్‌ఏఐ భరిస్తుందని తెలియచేయడం జరిగింది.ఇక  ఎవరైతే ఫాస్టాగ్ తీసుకున్న వారు దీనికి తమ బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేసుకోవలసి ఉంటుంది అని తెలిపారు.

 

మరోవైపు ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా ఫాస్టాగ్‌ కొనుగోలుపై రూ.50 క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ ద్వారా కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫాస్టాగ్స్ కోసం వెహికల్ ఆర్‌సీ కాపీని కచ్చితంగా ఇవ్వాలి అని తెలియచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: