కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్స్‌ను తప్పనిసరి చేసింది. అంటే జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు ఫాస్టాగ్స్‌ను కచ్చితంగా కలిగి ఉండాలి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ వ్యవస్థను రూపొందించింది. ఎన్‌పీసీఐ నిర్ణయంతో డిజిటల్ పేమెంట్స్ కూడా పెరగనున్నాయి. 

 

అలాగే వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద వేచిచూడాల్సిన అవసరం లేదు. ఫ్యూయెల్ ఆదా అవుతుంది. అలాగే కాలుష్యం కూడా అదుపు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఫాస్టాగ్స్ అంటే ఏమిటి ? ఎక్కడ తీసుకోవాలి? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? వంటి విషయాల గురించి తెలుసుకుంద్దామా మరి...

 

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ఆధారంగా ఫాస్టాగ్స్‌ పనిచేస్తాయి. ఫాస్టాగ్‌ను వెహికల్ అద్దంపై అతికించడం జరుగుతుంది. వెహికల్ టోల్ ప్లాజాల వద్ద నుంచి వెళ్లేటప్పుడు ఆటోమేటిక్‌గానే టోల్ చార్జీలు కట్ అవ్వడం జరుగుతుంది. దీని కోసం వెహికల్‌ను ఆపవలసిన అవసరం లేదు. టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ రీడర్స్ వెహికల్ వెళ్లేటప్పుడు అద్దంపై ఉన్న ఫాస్టాగ్‌ను స్కాన్ చేయడం జరుగుతుంది.

 

అప్పుడు మీ అకౌంట్‌ నుంచి డబ్బులు కట్ అవుతాయి. అప్పుడు వాహనదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు డబ్బులు కట్ అయినట్లు ఎస్ఎంఎస్ వస్తుంది. ఫాస్టాగ్స్‌ను నాలుగేళ్ల కిందటనే తీసుకువచ్చారు. అయితే ఇది ఇప్పటి వరకు ఆప్షనల్‌గానే ఉంది. అయితే డిసెంబర్ 1 నుంచి మాత్రం ఫాస్టాగ్‌ను తప్పనిసరి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా 500కు పైగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. 

 

ఫోర్ వీలర్ ప్యాసింజర్ వెహికల్స్, అన్ని వాణిజ్య వాహనాలకు (బస్సులు, ట్రక్స్, ట్రాక్టర్లు, కన్‌స్ట్రక్షన్ మిషనరీ వంటివి) ఫాస్టాగ్స్ తప్పనిసరి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. టోల్ ప్లాజాల వల్ల కేవలం ఒక్క లైన్ మాత్రమే నగదు రూపంలో చార్జీల చెల్లంపునకు అనుమతి ఇచ్చారు. ఇక మిగతా వాటన్నింటిలోనూ ఫాస్టాగ్స్ వ్యవస్థ అమలులోకి రాబోతుంది. 

 

 ఫాస్టాగ్ కోసం రూ.100 ఫీజు చెల్లించాలి. తర్వాత ఫాస్టాగ్ అకౌంట్‌లోకి డబ్బులు యాడ్ చేసుకోవాలి. అయితే డిసెంబర్ 1 వరకు కస్టమర్లకు ఫాస్టాగ్స్‌ను ఉచితంగా అందించాలని బ్యాంకులను ఎన్‌హెచ్ఏఐ కోరింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: