భారత దేశంలో వెయ్యి చెప్పండి..లక్ష చెప్పండి..బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరు.  రవ్వంత బంగారమైనా తమకు సింగారమే అంటారు.  అలనాటి రాజుల నుంచి నేటి సామాన్య ప్రజల వరకు బంగారం తమ జీవితాల్లో ఒక భాగం అయ్యింది.   బంగారం అంటే మహిళలు ఎంత ఇష్టపడతారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  అందుకే ప్రతియేటా బంగారం రేటు పెరిగిపోతూనే ఉంది. బంగారం రేటు ఎంత పెరిగినా.. పండుగలు, శుభ కార్యాలకు బంగారం కొంటూనే ఉంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే జూవెలరీ షాపుల్లో కోలాహలం నెలకొంటుంది. 

 

 గత కొన్ని రోజుల నుంచి అంతర్జాతీయ మార్కెట్ విషయంలో పెను మార్పులు రావడం..బంగారం రేటు ఉన్నఫలంగా పెరిగిపోవడం జరిగింది.  దాంతో కొంత బంగారం విక్రయం తగ్గిందనే అంటున్నారు షాపు యజమానులు. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,550కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో  10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.140 తగ్గింది. దీంతో ధర రూ.36,250కు క్షీణించింది. 

 

ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర ఏకంగా రూ.300 పడిపోయింది.  మొన్నటి వరకు బంగారం కొనాలంటే హడలి పోతున్న బంగారు ప్రియులకు ఇది శుభవార్త అనే చెప్పొచ్చు.  అయితే బంగారం రేటు ఏ క్షణంలో పెరిగిపోతుందో అన్న భయంతో ఇప్పుడు షాపుల్లోకి పరుగులు పెడుతున్నారు. బంగారం బాటలోనే సింగారం నడుస్తుంది.. కేజీ వెండి ధర రూ.300 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,400కు పడిపోయింది.  

 

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. ఉన్నట్టుండి ఇలా బంగారం రేటు తగ్గడానికి గల కారణం అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలే అంటున్నారు.  అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది. ఏది ఏమైనా బంగార ప్రియులు ఇదే మంచి సమయం అనుకొని కొనుగోలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: