భారతీయులకు బంగారం పై మక్కువ ఎక్కువ అది అందరికి తెలిసిందే.. అలాగే చాల మంది బంగారాన్ని ఇంట్లో కన్నా బ్యాంక్ లాకర్లలో పెడితే భద్రంగా ఉంటుందని భావిస్తున్నారు.  పెళ్లి లేదా పండుగ సీజన్‌ సమయంలో బంగారం కొనేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బ్యాంకులో బంగారు నగలు పెడితే సుక్షితంగా ఉంటాయని అనుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. లాకర్‌లోని వస్తువులకు బ్యాంక్ బాధ్యత తీసుకోదు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్‌ లాకర్‌లో బంగారం పెట్టాలని భావిస్తే.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

 

 

బ్యాంకులు బాధ్యత కాదని తెలిసిన తర్వాత లాకర్‌లో జువెలరీ దాచుకోవడం ఎందుకులే అని అనుకుంటున్నారా..? లేదంటే ఉన్న జువెలరీని బయటకు తీసుకోవాలని భావిస్తున్నారా..? మీకు ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. లాకర్లు కచ్చితంగా బెస్ట్ ఆప్షన్‌ అని చెప్పుకోవచ్చు. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు బ్యాంక్ లాకర్ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తున్నాయి. దీంతో లాకర్‌లో దాస్తున్న బంగారు ఆభరణాలకు పూర్తి రక్షణ లభిస్తుంది. టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ కంపెనీ హైనెట్‌వర్త్ లేదా ధనవంతులకు సమగ్రమైన ప్యాకేజ్‌డ్ పాలసీ అందిస్తోంది. ఈ పాలసీ తీసుకుంటే బ్యాంక్ లాకర్‌కు మాత్రమే కాకుండా ఇంట్లో బంగారం పెట్టుకున్నా పాలసీ వర్తిస్తుంది.

 

 

కేవలం టాటా ఏఐజీ మాత్రమే కాకుండా ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా స్టాండలోన్ బ్యాంక్ లాకర్ పాలసీ అందిస్తోంది. ఈ పాలసీ తీసుకుంటే మీ నగలకు పూర్తి రక్షణ లభిస్తుంది. అగ్ని ప్రమాదం, భూకంపాలు, దొంగతనం వంటి సందర్భాల్లో లాకర్‌లోని నగలు లేదా ఇతర విలువైన వస్తువులు పోతే అప్పుడు పాలసీ కవరేజ్ లభిస్తుంది. కేవలం జువెలరీ, విలువైన వస్తువులకు మాత్రమే కాకుండా కీలకమైన డాక్యుమెంట్లకు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. డ్యామేజ్ జరిగినప్పుడు వీటికి రిప్లేస్‌మెంట్ పొందొచ్చు. అందుకే బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులతోపాటు కీలకమైన డాక్యుమెంట్లకు కూడా పాలసీ తీసుకునేటప్పుడు కవరేజ్ వర్తించేటట్లు చూసుకోండి.

 

 

బ్యాంక్ లాకర్ ఇన్సూరెన్స్ సేవలు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్ ప్రకారం.. రూ.3 లక్షల కవరేజ్ తీసుకుంటే రూ.300 ప్రీమియం చెల్లించాలి. కనీసం రూ.3 లక్షలకు పాలసీ తీసుకోవాలి. ఇక గరిష్టంగా రూ.40 లక్షల వరకు కవరేజ్ వర్తిస్తుంది. దీనికి రూ.2,500 ప్రీమియం చెల్లించాలి. అదే రూ.40 లక్షలకు పైన పాలసీ తీసుకుంటే అప్పుడు చార్జీలు ఎక్కువగా ఉంటాయి. బంగారు నగల విలువ చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇంకా విలువైన వస్తువులకు కూడా పాలసీ కవరేజ్ లభిస్తుంది. ఇంకా కీలకమైన డాక్యుమెంట్లకు కూడా పాలసీ తీసుకోవచ్చు. ఇవ్వన్నీ విలువైనవే. ఇకపోతే ప్రీమియం మొత్తం కూడా తక్కువగానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏమన్నా జరిగినప్పుడు బాధపడటం కన్నా ముందుగానే పాలసీ తీసుకోవడం మంచిదే కదా..? ఒక కంపెనీ పాలసీని మరో కంపెనీ పాలసీతో పోల్చి చూసుకోండి

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: