బంగారం ధరలు ఈ మధ్యకాలంలో స్థిరంగా అసలు కొనసాగడం లేదు. ఒకరోజు భారీగా తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం వరుకు పెరిగిన బంగారం ధరలు రెండు రోజుల నుంచి భారీగా పతనమవుతూ వస్తున్నయి. ఈ బంగారం ధరలు చూసి పసిడి ప్రియులు సైతం బాబోయ్ ఎంత తగ్గాయి అని ఆశ్చర్యపోతున్నారు. 

 

ఈ నేపథ్యంలోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు 35వేల రూపాయలకు పడిపోయింది. నేడు హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.39,055 చేరుకోగా, అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,154లకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా తగ్గటమే కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే.. బంగారంతో పాటుగా వెండి ధర కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి రూ. 46,400 రూపాయలకు చేరింది. 

 

కాగా వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఇలా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్స్ బంగారం ధర 39,150 రూపాయిలు, 22 క్యారెట్స్ బంగారం ధర 36,450 వద్ద ఉంది. ఇక చెన్నైలోను 24 క్యారెట్స్ బంగారం ధర 39,410 రూపాయిల వద్ద, 22 క్యారెట్స్ బంగారం ధర 36,130 రూపాయిల వద్ద ఉంది. 

 

దేశ ఆర్ధిక రాజధాని ముంబాయిలో 24 క్యారెట్స్ బంగారం ధర 39,410, 22 క్యారెట్స్ బంగారం ధర 36,130 వద్ద ఉంది, ఇక విజయవాడలో 24 క్యారెట్స్ బంగారం ధర 39,115 రూపాయిల వద్ద, 22 క్యారెట్స్ బంగారం 35,900 వద్ద కొనసాగుతుంది. కాగా విశాఖపట్నలో 24 క్యారెట్స్ బంగారం ధర 39,120 రూపాయిల వద్ద, 22 క్యారెట్స్ బంగారం ధర 36,050 రూపాయిల వద్ద కొనసాగుతుంది. చూసారుగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే బంగారం వెళ్లి కోనేయండి.. మళ్ళి ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: