జియో.. ఎప్పుడు సంచలనమే. జియో ఓ కొత్త ప్లాన్ తీసుకుంది అంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. మళ్ళి ఎం నిర్ణయం తీసుకుంది రా బాబు అని తలలు పట్టుకుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్లన్స్ తీసుకొచ్చి అందరిని సంతోష పెడుతుంది జియో. ప్రజల డబ్బులను ఫోన్ కాల్స్ రీచార్జ్ పేరుతో దోచేస్తున్న నెటవర్క్స్ అన్నింటికీ ఒక్కసారిగా పెద్ద షాక్ ఇచ్చింది. 

 

అయితే జియో కూడా మొన్నటికి మొన్న అక్టోబర్ లో టారిఫ్ రేట్లను పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ టారిఫ్ రేట్లతో పాటు దానికి తగ్గట్టు ఐయూసీ ప్యాక్ ల ద్వారా డేటాను కూడా అందిస్తుంది. అయితే ఈ రేట్లను పెంచినందుకు అన్ని వైపులా నుండి భారీగా విమర్శలు వచ్చాయి. దీంతో ఒకవైపు రేట్లు పెంచుతూనే మరోవైపు సంచలన నిర్ణయం తీసుకుంది జియో సంస్ద. 

 

దేశంలోనే అతి పెద్ద టీవీ నెట్ వర్క్ ల్లో ఒకటైన సన్ గ్రూపు ఓటీటీ ప్లాట్ ఫాం సన్ నెక్స్ట్ లోని కంటెంట్ ను జియోకు సంబంధించిన జియో సినిమా యాప్ లో ఉచితంగా చూడవచ్చు. జియో సినిమా యాప్ లో రిలయన్స్ జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది జియో వినియోగదారులకు మాత్రమే అంబానీ ఉచితంగా అందించే స్ట్రీమింగ్ సర్వీస్ అని చెప్పచు. 

 

ఇందులో వివిధ భాషలకు సంబంధించిన సినిమాలు అన్ని ఫ్రీగా చూడచ్చు. అంతేకాకుండా డిస్నీతో చేసుకున్న ప్రత్యేక ఒప్పందం ద్వారా డిస్నీకి సంబంధించిన సీరియల్స్, సినిమాలు కూడా ఇందులో ఫ్రీ గా చూడచ్చు. జీ5, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో వచ్చే ఒరిజినల్ సిరీస్ లు, ఒరిజినల్ కంటెంట్ కాకుండా సన్ గ్రూప్ ఏ సినిమాల హక్కులను అయితే కొనుగోలు చేసిందో ఆ సినిమాలు అన్ని ఇందులో ఉంటాయి. 

 

ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషలకు చెందిన కంటెంట్ అందుబాటులో ఉంది. దీంతో రూ.480 రూపాయిలను వినియోగదారులకు ఫ్రీగా ఇస్తుంది. అయితే ఇందులో ఫ్రీగా సినిమాలు చూసేందుకు జియో సినిమా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో లాగిన్ అవ్వాలి. అప్పుడు సన్ నెక్స్ట్ లో ఫ్రీగా సినిమాలు చూడచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: