మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? లేదంటే  మీ వద్ద కారుందా? అయితే  ఈ శుభవార్త మీకోసం. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ తాజాగా మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి కొత్త డ్రాఫ్ట్‌ను కూడా ఆవిష్కరించడం జరిగింది.

 

ఐఆర్‌డీఏఐ కొత్త డ్రాఫ్ట్‌లో పలు మార్పులను కూడా తెలియచేయడం జరిగింది. దీంతో కన్సూమర్లకు ప్రయోజనం బాగా వస్తుంది. వెహికల్ పోయినప్పుడు పొందే బీమా మొత్తం, వాహన విభాగాలపై క్లెయిమ్ చేసుకునే బీమా, ఇంజిన్ డ్యామేజ్‌కు ఇన్సూరెన్స్ కవరేజ్, కన్సూమబుల్ ఐటమ్స్ పలు అంశాలకు సంబంధించి వాహనదారులకు బాగా లాభాలు లభిస్తాయి.

 

సాధారణంగా ఎవరైనా వెహికల్స్ కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో ప్రీమియం లెక్కింపు కోసం కూడా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ అనుకుంటుంది. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా మార్పులు చేయాలనే భావనలో ఉంది.  మీ వెహికల్‌ను ఎవరైనా దొంగలిస్తే లేదంటే యాక్సిడెంట్ సహా ఇతర కారణాల వల్ల పాడైపోతే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మీకు చెల్లించే గరిష్ట బీమా మొత్తాన్ని ఐడీవీగా తెలియ చేస్తున్నారు.

 

వాస్తవానికి  వెహికల్ ఎక్స్‌షోరూమ్ ధర ప్రాతిపదికన దీన్ని లెక్కించడం జరుగుతుంది. అయితే డ్రాఫ్ట్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఐడీవీ విలువను ఆన్ రోడ్ ధర ప్రాతిపదికన మారడం జరుగుతుంది. అలాగే ఐడీవీ విలువ తగ్గింపు ప్రతి సంవత్సరం ఉండదు మనకి. మూడు సంవత్సరాల తర్వాత  నుంచే ఐడీవీ విలువ తగ్గింపు లభిస్తుంది  అని  సంస్థ తెలుపుతుంది. 

 

ఇలా చేయడం వల్ల  వాహన కస్టమర్లకు ఎంతో ప్రయోజనం కలుగనుంది. అంతేకాకుండా ఇప్పుడు వెహికల్ అన్ని విడిభాగాలపై డిప్రిసియేషన్ కూడా లేకుండా ఉండడం గమనించవలసిన విషయం. అయితే కొత్త నిబంధనలు అమలులోకి వస్తే వెహికల్‌కు చెందిన ప్రతి విడిభాగంపై కూడా డిప్రిసియేషన్ వ్యాల్యూ బాగా ఉంటుంది అని సంస్థ తెలుపుతుంది. 

 

 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: