ముకేశ్ అంబానీ భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. ఫోర్బ్స్ జాబితాలో ప్రతీ ఏడాది చోటు సంపాదించుకుంటూ అపర కుబేరుల్లో తానే బెస్ట్ అంటూ అంచెలంచెలుగా ఎదిగి తన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ లిమిటెడ్ మార్కెట్ విలువను రూ 10 లక్షల కోట్ల క్లబ్ లో చేర్చి భారతీయ మార్కెట్ సత్తాను ప్రపంచానికి తెలియచేసారు. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. ముఖేష్ అంబానీ ఏదీ చేసిన సంచలనమే. మార్కెట్లో కొత్త కొత్త ఎత్తుగడలను ఎదుర్కొంటూ తన తెలివితేటలతో ఈ ఘనతను సాధించారు ముఖేష్ అంబానీ. 

 

వాస్తవానికి అక్టోబర్ లో రిలయన్స్ మార్కెట్ రూ 9 లక్షల కోట్లు ఉండగా కేవలం 25 రోజుల్లోనే రూ 10 లక్షల కోట్ల మార్క్ ను చేరుకుంది. గురువారం (నవంబర్ 28) ట్రేడింగ్ ముగిసే సమయానికి రిలయన్స్ మార్కెట్ విలువ రూ.10,01,555.42 కోట్లుగా నమోదు అయింది. అంతకు ముందు రోజు కూడా రూ 10 లక్షల కోట్లకు దగ్గరకు వచ్చినా ఆ మార్కును మాత్రం దాటలేదు కానీ గురువారం ఈ ఘనతను సాధించింది రిలయన్స్ కంపెనీ. 

 

రిలయన్స్ ఈ ఘనత వెనుక జియోదే పెద్ద పాత్ర 

 

2015 వ సంవత్సరంలో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ని ప్రకటించి సంచలనం సృష్టించారు అప్పటివరకు కాల్ ధరలు, డేటా ధరలు ఆకాశాన్ని అంటగా జియో వచ్చి అంతా ఫ్రీ అనే సరికి జనాలు జియో కి బ్రహ్మరథం పట్టారు. జియో రిలయన్స్ పేరు ను ప్రపంచం వ్యాప్తంగా మారుమ్రోగేలా చేసింది. జియో దెబ్బకి చాలా టెలికాం ఆపరేటర్లు తమ బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. కేవలం నాలుగు ఏళ్లలో 355.17 మిలియన్ కస్టమర్లను సంపాదించింది జియో. జియో పుణ్యమాని 2018 ఆగస్టులో రూ 8 లక్షల కోట్లుగా ఉన్న రిలయన్స్ మార్కెట్ విలువ కేవలం 15 నెలల్లోనే రూ 10 లక్షల కోట్లకు ఎగబాకింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: