దేశీ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐనా ఐసీఐసీఐ బ్యాంక్ చాల ముందుకు కొనసాగుతుంది. ఇక బ్యాంక్ షేరు ధర మాత్రం ముందుకు బాగా దూసుకొని పోతుంది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ షేరు  52 వారాల గరిష్ట స్థాయిలో నిలవడం జరిగింది. ఇలా గరిష్ట స్థాయిలో నిలవడానికి  గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇందుకు ముఖ్యమైన కారణం. ఈ బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ షేరుపై ఓవర్ వెయిట్‌తో ముందుకు కొనసాగుతుంది.

 

ఇక మోర్గాన్ స్టాన్లీ ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర వచ్చే రెండేళ్ల కాలంలో డబుల్ అవుతుందని అంచనా వేయడం జరిగింది. మార్కెట్‌లో లేదా బ్యాంకింగ్ రంగంలో ఈ స్టాక్ అదిరిపోయే పనితీరు కనబరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేయడం జరిగింది. అందుకే ఓవర్‌ వెయిట్ రేటింగ్ ఇవ్వడం  జరిగింది అని తెలుపుతున్నారు. ఇక షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు  ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్‌కు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది.

 

ఇక వ్యాల్యుయేషన్ డిస్కౌంట్ విషయానికి వస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్ షేరు గత 18 నెలలుగా మంచి పనితీరు కనబరుస్తూ వస్తోందని మోర్గాన్ స్టాన్లీ తెలియచేయడం జరిగింది. కానీ ఇతర ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంక్ షేరు వ్యాల్యుయేషన్ ఇంకా తక్కువ స్థాయిల్లోనే ఉందని తెలిపారు. ఇక ఈ బ్యాంకుకు  వ్యాల్యుయేషన్స్ ఆకర్షణీయంగా ఉండటం వల్ల స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు కూడా చేయడం జరిగింది.

 

ఇక ఆర్థిక ఫలితాలు తెలుసుకుందామా మరి..ఐసీఐసీఐ బ్యాంక్ 2019-20 ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో నికర లాభంలో దాదాపు 28 శాతం క్షీతను నమోదు చేసుకోవడం జరిగింది. నికర లాభం వార్షిక ప్రాతిపదికన చూస్తే రూ.909 కోట్ల నుంచి రూ.655 కోట్లకు పడి పోవడం జరిగింది. పన్ను వ్యయాలు ఎక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం అని అధికారులు వెల్లడిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: