ఒకటే స్కీమ్.. రెండు వడ్డీలు అంటే చాల  ఆశక్తి కరమైన విషయంగా ఉంది కదా? అవును ఇది నిజమే. ఒక స్కీమ్‌పై ఒకరికి ఒక వడ్డీ వస్తుంది . మరోకరికి ఇంకో రకం వడ్డీ లభిస్తుంది. కానీ కేంద్రం  ఇచ్చేది మాత్రం ఒకటే వడ్డీ. అయితే ఇది పొందేవారి ప్రాదిపదికన మాత్రం చాల మారుతుంది. వీటి వివరాలు తెలుసుకుందామా మరి...చాలా మందికి  పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీమ్ గురించి తెలిసే ఉంటుంది కదా. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.9 శాతం వడ్డీ రేటు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇది తక్కువ వడ్డీ అని అనుకుంటే ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలను చూసుకోవడం చాల మంచిది . 

 

బ్యాంక్ ఎఫ్‌డీలను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. వీటిపై కూడా ఆకర్షణీయ వడ్డీ వస్తుంది. కానీ  ఇక్కడ  మీరు ఒక విషయం కచ్చితంగా  గుర్తు పెట్టుకోవాలి. బ్యాంక్ ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే పీపీఎఫ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేసే డబ్బులపై ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. డిపాజిట్ చేసిన మొత్తం, దీనిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత విత్‌డ్రా చేసుకునే డబ్బుపై పూర్తి పన్ను మినహాయింపు చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది.

 

ఇలాంటి సందర్భంలో వాస్తవిక రాబడి లేదా ప్రిట్యాక్స్ ఈల్డ్ ఎక్కువగా ఉండడం గమనించవలసిన విషయం. పన్ను విధింపునకు ముందు ఇన్వెస్ట్‌మెంట్ సాధానంపై పొందే రాబడిని ప్రిట్యా్క్స్ ఈల్డ్‌గా పేర్కొనడం జరుగుతుంది. ఇక పీపీఎఫ్ అకౌంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం 7.9 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. అంటే దీనిపై వడ్డీ ఆదాయం  11.4 శాతం వస్తుంది ఇన్వెస్ట్ చేసిన వారికీ. అలాగే పలు ట్యాక్సబుల్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు ఎక్కువ వడ్డీ రేటు కూడా లభించడం జరుగుతుంది. కానీ  వీటిల్లో మాత్రం  రిస్క్ చాల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అన్ని విషయాలు చదివి ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: