ఈ మద్య కాలంలో బ్యాంక్ లావాదేవీలు అత్యంత సులభతరం అయ్యాయి.  ఒకప్పుడు బ్యాంక్ కి సంబంధించిన ఏ చిన్న పని ఉన్నా క్యూ కట్టి గంటల తరబడి వెయిట్ చేయాల్సి ఉండేది.  టెక్నాలజీ పెరిగిపోయింది...అరచేతిలో స్మాట్ ఫోన్ ఉంటే చాలు చిటికెలో బ్యాంక్ పనులు పూర్తవుతున్నాయి.  ఒకప్పుడు షాపింగ్ కి వెళ్తే పర్సులో డబ్బులు పెట్టుకొని ఆ డబ్బులు పదే పదే జాగ్రత్తగా చూసుకుంటూ నానా ఇబ్బందులు పడేవారు.  ఎప్పుడైతే క్రెడిట్, డెబిట్ కార్డులు వచ్చాయో... కూల్ గా మార్కెట్ కి వెళ్లి నచ్చింది కొనుగోలు చేస్తున్నారు.  ఇక స్మార్ట్ ఫోన్ లో కొన్ని బ్యాంకులకు సంబంధించిన యాప్స్ ద్వారా కూడా కొనుగోళ్లు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన గూగుల్ పే కస్టమర్లకు ఒక అద్భుతమైనా సదుపాయాన్ని తీసుకువచ్చింది.

 

 గూగుల్, పే యాప్, పేటీఎం ఇలా ఎన్నో యాప్స్ సామాన్యు చెంతకు వచ్చింది.  సమయానికి డబ్బులు లేకపోతే ఆ యాప్స్ ద్వారా లావాదేవీలు చేసుకునే సదుపాయం వచ్చింది.  తాజాగా సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన గూగుల్ పే కస్టమర్లకు రూ.1వేయి గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. టీవీ లేదా యూట్యూబ్‌లో ప్లే అయ్యే గూగుల్ పే యాడ్‌ను ఫోన్లలోని గూగుల్ పే యాప్‌లో ఉండే ప్రమోషన్స్ సెక్షన్‌లోని ఆన్-ఎయిర్ ఆప్షన్ ద్వారా వింటే యూజర్లకు ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది.  సదరు యాడ్‌ను కనీసం 20 సెకన్ల పాటు యాప్ ద్వారా వినాల్సి ఉంటుంది. దీంతో గూగుల్ పే ఆ యాడ్‌ను గుర్తించి యూజర్‌కు స్క్రాచ్ కార్డును ఇస్తుంది. దాంతో వారు రూ.1వేయి వరకు గెలుచుకోవచ్చు.  

 

ఈ ఆఫర్ ఇప్పటికే గూగుల్ పే వినియోగదారులకు అందుబాటులో ఉండగా డిసెంబర్ 2 వరకు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని గూగుల్ పే తెలిపింది. ఇప్పటి వరకు గూగుల్ పే చేసే వారికి స్క్రాచ్ ద్వారా పేమెంట్ ఇస్తున్న విషయం తెలిసిందే.  యూజ‌ర్ల‌కు ఆఫ‌ర్ క‌నిపించ‌క‌పోతే గూగుల్ పేకు గాను లొకేష‌న్ హిస్ట‌రీని ఆన్ చేయాల్సి ఉంటుంది. అనంత‌రం ప్ర‌మోష‌న్స్ సెక్ష‌న్‌లో ఆడియో రివార్డ్స్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. అందులో ఆన్ ఎయిర్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌డం ద్వారా ఆ గూగుల్ పే ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: