ఇదిగో వినండి వొడాఫోన్, ఐడియా వినియోగదారులకు భారీ షాక్ వార్తను విడుదల చేసింది టెలికం ఆపరేటర్లు. ఇక చౌక మొబైల్‌ చార్జీలకు సమయం  చెల్లింది. ఈ నెల 3 నుంచి కాల్‌ చార్జీలు భారీగా  భారీగా పెంచుతున్నట్లు టెలికం ఆపరేటర్లు తెలిపాయి. మొబైల్‌ కాల్స్‌, డేటా చార్జీలను మంగళవారం నుంచి పెంచనున్నట్టు టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్ - ఐడియా ప్రకటించడం జరిగింది. ప్రీపెయిడ్‌ విభాగంలో రెండు రోజులు, 28, 84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్‌లపై చార్జీలను పెంచనున్నట్టు కంపెనీ తెలియచేయడం జరిగింది. తాజా ప్లాన్‌లు  పాత ప్లాన్‌లతో పోలిస్తే దాదాపు 42 శాతం మేరకు భారమ అవుతాయి అని పేర్కొంటున్నాయి.

 

ఇక ప్రీపెయిడ్‌ సేవలు, ప్రోడక్టులపై నూతన టారిఫ్‌లు, ప్లాన్‌లను ప్రకటించామని, డిసెంబర్‌ 3 నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ ఓ ప్రకటనలో తెలియచేయడం జరిగింది. డిసెంబర్‌ నుంచి మొబైల్‌ టారిఫ్‌లను పెంచుతామని భారత టెలికాం ఆపరేటర్లు గత నెలలో ప్రకటించిన సంగతి అందరికి  తెలిసిందే కదా. టెలికాం టారిఫ్‌ల సవరణపై ట్రాయ్‌ సంప్రదింపుల ప్రక్రియ నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా టారిఫ్‌ పెంపను ప్రకటించడం జరిగింది అని పేర్కొంటున్నాయి. 

 

మరోవైపు దేశంలో డిజిటల్‌ మళ్లింపు, డేటా వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపని రీతిలో రానున్న వారాల్లో టారిఫ్‌లను పెంచుతామని రిలయన్స్‌ జియో కంపెనీ ఓ ప్రకటనలో తెలియచేయడం జరిగింది. ఇక ఎయిర్‌టెల్‌ సైతం టారిఫ్‌ల పెంపునకు రంగం సిద్ధంచేసుకుంటున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి అన్ని టెలికం సంస్థలు చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటనలు వస్తున్నాయి. దీనితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: