జియో.. ఎప్పుడు సంచలనమే. జియో ఓ కొత్త ప్లాన్ తీసుకుంది అంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. మళ్ళి ఎం నిర్ణయం తీసుకుంది రా బాబు అని తలలు పట్టుకుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్లన్స్ తీసుకొచ్చి అందరిని సంతోష పెడుతుంది జియో. ప్రజల డబ్బులను ఫోన్ కాల్స్ రీచార్జ్ పేరుతో దోచేస్తున్న నెటవర్క్స్ అన్నింటికీ ఒక్కసారిగా పెద్ద షాక్ ఇచ్చింది. 

 

అయితే జియో కూడా మొన్నటికి మొన్న అక్టోబర్ లో టారిఫ్ రేట్లను పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ టారిఫ్ రేట్లతో పాటు దానికి తగ్గట్టు ఐయూసీ ఫ్యాక్ ల ద్వారా డేటాను కూడా అందిస్తుంది. అయితే ఈ రేట్లను పెంచినందుకు అన్ని వైపులా నుండి భారీగా విమర్శలు వచ్చాయి. దీంతో ఒకవైపు రేట్లు పెంచుతూనే మరోవైపు సంచలన నిర్ణయం తీసుకుంది జియో సంస్ద.  

 

ఈ నెల 3 నుంచి కాల్, డేటా చార్జీలను పెంచుతున్నట్టు వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించిన కాసేపటికే రిలయన్స్ జియో కూడా చార్జీల పెంపుపై ప్రకటన చేసింది. వాయిస్, డేటా చార్జీలను 40 శాతం మేర పెంచుతున్నట్టు ప్రకటించి షాకిచ్చింది. ఇందులో భాగంగా 6 నుంచి కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్లను తీసుకురానున్నట్టు జియో ప్రకటించింది. 

 

ఈ ప్లాన్లలో నాన్ జియో నంబర్లకు చేసే కాల్స్‌కు ఎఫ్‌యూపీ పరిమితిని విధించబోతున్నట్టు తెలిపింది. నూతన ప్లాన్ల కింద 300 శాతం అదనపు ప్రయోజనాలు ఇస్తున్నట్టు శుభవార్త చెప్పింది. వినియోగదారుల ప్రయోజనానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్న జియో దేశంలోని టెలికమ్యూనికేషన్ పరిశ్రమను నిలబెట్టేందుకు సిద్ధమని హామీ ఇచ్చింది. 

 

భారతీ ఎయిర్‌టెల్ కాల్, డేటా చార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. డిసెంబరు 3 నుంచి కొత్త ప్లాన్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా ఎయిర్‌టెల్ ఖాతాదారులపై 42 శాతం అధిక భారం పడనుంది. మూడో తేదీ నుంచి వొడాఫోన్, ఐడియా కూడా కొత్త ప్లాన్లు అమల్లోకి వస్తాయని వివరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: