టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు పిడుగులాంటి వార్తను చెప్పాయి. బుధవారం (డిసెంబర్ 3) నుంచి చార్జీల బాదుడికి రంగం సిద్ధం చేసుకున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఇప్పటి వరకూ చౌక ధరలకే ఎక్కువ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ ను అందివ్వగా ఇప్పుడు అవి ప్రియం కానున్నాయి. ఇప్పటి వరకూ ఐయూసీ నిబంధన జియో మాత్రమే అమలు చేస్తుండగా, ఎయిర్టెల్ కూడా డిసెంబర్ 3 నుంచి తమ నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్ కు కాల్ చేసే వినియోగదారుల నుంచి నిమిషానికి 6 పైసలు వసూల్ చేయనుంది.

 

ఎవరెంత పెంచారు

 

వోడాఫోన్ ఐడియా ప్రస్తుతం ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ పై 40% పెంచుతున్నట్లు ప్రకటించింది అంటే ప్రతీ 100 రూపాయలకు 40 రూపాయలు పెరుగుతుందన్నమాట. ఇప్పటి వరకూ 84 రోజుల వాలిడిటీ తో రోజుకు 1.5 జీబీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ ను రూ 458 కు అందిస్తుండగా ధరల పెంపు తర్వాత ఇదే ప్లాన్ రూ 598 కానుంది. ఇక 365 రోజులు వాలిడిటీ ఉన్న ప్లాన్స్ రూ 998 మరియు రూ 1699 ఉండగా ఇకపై ఇవి రూ 1499 మరియు రూ 2399 అవ్వనున్నాయి.

 

ఇక ఎయిర్టెల్ కూడా ఇదే తరహాలో ధరల పెంపును అమలు చెయ్యగా కొత్తగా ఐయూసీ నిబంధనను తీసుకువచ్చి అన్లిమిటెడ్ కాల్స్ ను ఎత్తేసింది. 28 రోజుల ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్నా వారు 1000 నిముషాలు, 84 రోజుల వాలిడిటీ ప్లాన్ కు 3000 నిముషాలు మరియు 365 రోజుల ప్లాన్ కు 12000 నిముషాలు చొప్పున ఇతర నెటవర్కులకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు ఇక ఈ నిముషాలు అయిపోయాక నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.

 

రిలయన్స్ జియో కూడా 40 శాతం ధరలు పెంచుతున్నట్లు తెలిపింది అయితే ధరల పెంపుకు అనుగుణంగా 300 శాతం వరకు అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని తెలిపింది.

 

చార్జీల బాదుడు నుంచి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గం

 

టెలికాం ఆపరేటర్లు సోమవారం అర్ధరాత్రి నుంచే చార్జీలు అమల్లోకి వస్తుంది అని తెలిపిన నేపథ్యంలో, వినియోగదారులు ఈరోజే ఒక సంవత్సరం పాటు రీఛార్జ్ చేసుకుంటే రూ 800 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ప్రస్తుతం రూ 1699 కి 365 రోజులకు డైలీ 1.5 జీబీ చొప్పున అందిస్తోంది, ఇక వోడాఫోన్ ఐడియా కూడా ఇదే ధరకు అందిస్తోంది ధరల పెంపు తరువాత ఇవే ప్లాన్స్ రూ 2500 వరకు అవ్వనున్నాయి కాబట్టి వినియోగదారులు ఈరోజే 365 రోజులకు గానూ రీఛార్జ్ చేసుకుంటే సంవత్సరం వరకు మీ జేబుకి చిల్లు పడకుండా చూసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: