ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందకంటే దీని అవసరం అంతలా ఉంది ఇప్పుడు. కీలకమైన డాక్యుమెంట్లలో ఇది ఇప్పుడు మొదటిది. పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవడం, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలుకు, ప్రభుత్వ సబ్సిడీ సహా ఇతర అనేక రకాల పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ కార్డు కావాల్సిందే. 

 

Image result for adhar cards

 

పాన్ కార్డు, పాస్‌ పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు వంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉంటే వీటిని చూపించి ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ స్టేట్‌మెంట్, డ్రైవింగ్ లైసెన్స్, డేట్ ఆఫ్ బర్త్ వంటి అడ్రస్ ప్రూఫ్స్ ఉన్నా కూడా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఒకవేళ మీ వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోతే ఎలా అనుకుంటున్నారా? ఆధార్ కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలి?

 

ఆధార్ కార్డు ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ (నమోదు పత్రం) ప్రకారం, ఎలాంటి ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్స్ లేకపోతే ఆధార్ కార్డు పొందేందుకు మరో 2 మార్గాలు అందుబాటులో ఉన్నాయి మనకు. ఇంట్రడ్యూసర్ ద్వారా లేదంటే కుటుంబ పెద్ద తరుపున ఆధార్ కార్డుని తెలుసుకోవచ్చు. ఇప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేకుండా ఆధార్ కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలో చూద్దాం.

 

అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ లేకపోయినా కూడా ఆధార్ కోసం ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డులో మన పేరు ఉంటే చాలు. ఆధార్ కార్డు కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ పెద్ద ముందుగా సపోర్ట్ డాక్యుమెంట్లతో ముందుగా ఎన్‌ రోల్ చేసుకోవాలి. కుటుంబ పెద్ద తర్వాత ఇతర సభ్యులను ఎన్‌ రోల్ చేసుకోవచ్చు.

 

ఇక్కడ కుటుంబ పెద్ద ఖచ్చితంగా ఐడెంటిటీ ప్రూఫ్‌ ను, అడ్రస్ ప్రూఫ్‌ ను కలిగి ఉండాల్సి ఉండాలి. అలాగే ఈయన ఎవరినైతే ఎన్‌ రోల్ చేయించాలని భావిస్తున్నారో, ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ లో వారితో పాటే  ఉండాలి. ఇంటి పెద్ద ద్వారా ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకునేవారు వారితో ఉన్న రిలేషన్‌ షిప్ గురించి తెలపాల్సి ఉంటుంది. దీని కోసం కొన్ని డాక్యుమెంట్లు కూడా అవసరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: