టారిఫ్ పెంపు గురించి ప్రస్తుతం దేశంమొత్తం చర్చ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే మొదటగా ఈ పెంపును తెర మీదకు తీసుకువచ్చింది వొడాఫోన్. చార్జీలను పెంచుతున్నట్లు వొడాఫోన్ ప్రకటన వచ్చిన తర్వాతనే ఎయిర్ టెల్, జియో కూడా ఈ అంశంపై ఒక నిర్ణయానికి వచ్చాయి. ముందుగా ప్రకటించినట్లు వొడాఫోన్ తన కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.19 నుంచి ప్రారంభం కానున్నాయి.

 

2019 సంవత్సరం మూడో త్రైమాసికంలో మునుపెన్నడూ లేని విధంగా రూ.50 వేల కోట్లకు పైగా నష్టాన్ని వొడాఫోన్ - ఐడియా చూసింది. భారతదేశ కార్పొరేట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద నష్టం. దీనితో తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వొడాఫోన్ టారిఫ్ పెంపుపై ఆధారపడింది. వెంటనే ఎయిర్ టెల్, జియో కూడా తమ టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు ప్రకటించాయి. ఎయిర్ టెల్ ఇప్పటికే తమ కొత్త ప్లాన్లను ప్రకటించగా, జియో ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

 

వొడాఫోన్ - ఐడియా 28 రోజుల వ్యాలిడిటీతో నాలుగు అన్ లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. రూ.149 ప్లాన్ తో వొడాఫోన్ నుంచి వొడాఫోన్ కు అన్ లిమిటెడ్ ఉచిత కాలింగ్, ఇతర నెట్ వర్క్ లకు 1000 ఫ్రీ నిమిషాలు, 300 ఎస్ఎంఎస్ లను అందిస్తారు. నెల మొత్తానికి 2 జీబీ డేటా మాత్రమే అందుబాటులో ఉండనుంది. రూ.249 ప్లాన్ ద్వారా కూడా వొడాఫోన్ నుంచి వొడాఫోన్ కు అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, ఇతర నెట్ వర్క్ లకు 1000 ఉచిత నిమిషాలు, 300 ఎస్ఎంఎస్ లను అందిస్తారు. డేటా మాత్రం రోజుకు 1.5 జీబీ అందించనున్నారు. రూ.299, రూ.399 ప్లాన్లలో కూడా ఇవే లాభాలు లభిస్తాయి. డేటా విషయంలో మాత్రం కాస్త తేడా కనపడుతుంది. రూ.299తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 2 జీబీ, రూ.399తో రీచార్జ్ చేస్తే రోజుకు 3 జీబీ డేటా లభించనుంది.

 

ఇక 84 రోజుల వ్యాలిడిటీతో వొడాఫోన్ - ఐడియా మూడు అన్ లిమిటెడ్ ప్లాన్లను అందిస్తుంది. ఇందులో మొదటిది రూ.379 ప్లాన్, ఈ ప్లాన్ ద్వారా వొడాఫోన్ నుంచి వొడాఫోన్ కు ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 3000 ఫ్రీ నిమిషాలు, ప్లాన్ మొత్తానికి 1000 ఎస్ఎంఎస్ లను అందిస్తారు. మొత్తం 6 జీబీ డేటా లభిస్తుంది.
ఇక రూ.599 ప్లాన్ ద్వారా వొడాఫోన్ నుంచి వొడాఫోన్ కు ఫ్రీగా అపరిమిత కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 3000 ఫ్రీ నిమిషాలు అందిస్తారు. రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు లభించనున్నాయి. ఇంకో చివరిదైన రూ.699 ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే రూ.599 ప్లాన్ లాభాలే వర్తిస్తాయి. డేటా మాత్రం రోజుకు 2 జీబీ లభిస్తుంది.

 

ఇక్కడ 365 రోజుల వ్యాలిడిటీతో వొడాఫోన్ రెండు ప్లాన్లను అందించనుంది. వీటిలో మొదటిది అయిన రూ.1,499 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే వొడాఫోన్ నుంచి వొడాఫోన్ కు ఫ్రీగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ కు కాల్స్ కోసం 12 వేల నిమిషాలను అందిస్తారు. మొత్తంగా 24 జీబీ డేటా వస్తుంది. రూ.2399 ప్లాన్ విషయానికి వస్తే డేటా మినహాయిస్తే, మిగతా లాభాలన్నీ పై ప్లాన్ తరహాలోనే ఉంటాయి. డేటా మాత్రం రోజుకు 1.5 జీబీ మాత్రమే లభిస్తుంది.

 

వొడాఫోన్ తన ఫస్ట్ రీచార్జ్ ప్యాక్ ల్లోనూ మార్పులు తీసుకుంది. రూ.97 ఫస్ట్ రీచార్జ్ ప్యాక్ తో రీచార్జ్ చేసుకుంటే రూ.45 టాక్ టైం, 100 ఎంబీ డేటా, సెకనుకు పైసా కాల్ కాస్ట్ ఆఫర్ లభించనున్నాయి. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. అలాగే రూ.197 ప్యాక్ తో వొడాఫోన్ నుంచి వొడాఫోన్ కు అపరిమిత ఉచిత కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసుకోవడానికి వెయ్యి నిమిషాలు, నెల మొత్తానికి 2 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ లు ఇస్తున్నారు. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులు మాత్రమే ఉంది.

 

రూ.297 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే వొడాఫోన్ నుంచి వొడాఫోన్ కు ఫ్రీ కాల్స్, ఇతర్ నెట్ వర్క్ లకు కాల్ చేసుకోవడానికి 1000 ఫ్రీ నిమిషాలు, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు అందించనున్నారు. మరో ప్లాన్ రూ.397 తో కూడా రూ.297 ప్లాన్ లాభాలే అందుతాయి. ఇందులో డేటా మాత్రం రోజుకు 2 జీబీ లభిస్తుంది. ఈ రెండు ప్లాన్స్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: