మన దేశంలో రూ.10 వేలలోపు బడ్జెట్ ఫోన్లంటే షియోమీ, రియల్ మీ ఫోన్లు మాత్రమే అందరికి గుర్తుకు వస్తాయి. ఎందుకనగా ఆ ధరల శ్రేణిలో అత్యుత్తమ ఫీచర్లను ప్రజలకు అందించడం జరుగుతుంది కాబట్టి. కానీ మొదటి సారి వాటి కోటలో మరో సంస్థ రంగ ప్రవేశం చేసింది. హాంగ్ కాంగ్ కు చెందిన టెక్నో అనే స్మార్ట్ ఫోన్ సంస్థ రూ.8,499కే అదిరిపోయే ఫీచర్లు ఉన్న  స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో విడుదల చేయడం జరిగింది. అదే టెక్నో స్పార్క్ పవర్ స్మార్ట్ ఫోన్. కేవలం ఈ ధరలోనే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, అమోఎల్ఈడీ డిస్ ప్లే, వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన  ఫ్లిప్ కార్ట్ లో సేల్  మొదలు అయంది.


 
ప్రత్యేకతలు....

* ఈ స్మార్ ఫోన్ లో 6.35 అంగుళాల అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లే
* కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్, సెల్ఫీ ప్రియుల కోసం 13 మెగా పిక్సెల్ కెమెరా
* వెనకవైపు యాంటీ ఆయిల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ 
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్

 

ఫోన్ లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు కాబట్టి ఈ ఫోన్ ను ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 29 గంటల పాటు నిర్విరామంగా వీడియోలు చూడవచ్చని, 35 గంటల పాటు కాల్స్ మాట్లాడవచ్చని, 17 గంటల పాటు గేమింగ్, 200 గంటల పాటు సంగీతం వినవచ్చని కంపెనీ ప్రకటించడం జరిగింది. ఇందులో డ్యూయల్ సిమ్ ఫీచర్ కూడా  ఉంది. ఇందులో  4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఎఈ ఫోన్ డాన్ బ్లూ, ఆల్పెన్ గ్లో గోల్డ్ రంగుల్లో మార్కెట్లో అందుబాటులో కంపెనీ ఉంచడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: