దేశీ దిగ్గజ బ్యాంక్  ఐనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు చెందిన ఎస్‌బీఐ కార్డు తాజాగా తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇక ఎస్‌బీఐ వినియోగదారులపై చార్జీల బాదుడుకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్న వారిపై ప్రభావం పడుతుంది. ఎస్‌బీఐ కార్డు ఇప్పటికే చెక్‌బుక్ పేమెంట్స్‌పై చార్జీలను కూడా  వసూలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే కదా. చెబ్‌బుక్ రూపంలో రూ.2,000లోపు బిల్లు మొత్తం చెల్లింపులకు ఇది వర్తిస్తుంది అని అధికారులు తెలియచేస్తున్నారు. 

 

ఇప్పుడు మాత్రం  ఎస్‌బీఐ కార్డు అన్ని రకాల చెక్ పేమెంట్స్‌పై చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రూ.100తోపాటు ఇతర చార్జీలను వసూలు చేయాలని భావనలో ఉంది. అంటే అన్ని చెక్ పేమెంట్స్‌పై దాదాపు రూ.118 బాదుడు తప్పదు అని బాగా తెలుస్తుంది.  ఈ చార్జీలను 2020 జనవరి నుంచి రూ.118 చార్జీలను వసూలు చేయాలని ఎస్‌బీఐ బ్యాంకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కొంత మంది నుంచి ఎస్‌బీఐ చెక్ పేమెంట్స్‌కు చార్జీలను కూడా వసూలు చేయడం మొదలు పెట్టింది.

 

అసలు ఈ చార్జీలు ఎందుకుఅని సందేహం వస్తుంది మీకు.. అందుకు ముఖ్య కారణం ఇదే అని వివరంగా తెలుస్తుంది..వాటి వివరాలు ఇలా... ఎస్‌బీఐ కార్డు అమితా మిట్టల్ అనే కస్టమర్ నుంచి చెక్ పేమెంట్ చార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ఈమె క్రెడిట్ కార్డు బిల్లును చెక్ రూపంలో చెల్లించారు. ఎస్‌బీఐ కార్డు దీనిపై రూ.118 చార్జీ వేయడం జరిగింది. ‘చెక్ అనేది లీగల్ ఇన్‌స్ట్రూమెంట్. ఎస్‌బీఐ కార్డు అయినా కూడా పెనాల్టీ వసూలు చేస్తోంది’ అని మిట్టల్ తెలియచేయడం జరిగింది.

 

ఈ చార్జీల పెంపు వలన కస్టమర్లపై ప్రభావం ఇలా.. ఎస్‌బీఐ కస్టమర్ బేస్ 90 లక్షలుగా ఉంది. దేశవ్యాప్తంగా 130 పట్టణాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఎక్కువ మందిపై ప్రభావం ఉండవచు అని అధికారులు వెల్లడిస్తున్నారు. 

 

దేశంలోనే రెండో అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీ కంపెనీగా ఉన్న ఎస్‌బీఐ కార్డు ఇప్పటికే ఈ అంశాన్ని సైట్‌లో తెలియచేయడం జరిగింది. ‘2020 జనవరి 1 నుంచి చెక్ బుక్ ద్వారా ఔట్‌స్టాండింగ్ బిల్లు మొత్తాన్ని చెల్లిస్తే రూ.100 చార్జీ నియమిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఎస్‌బీఐ కార్డు అధికారిక పోర్టల్ లేదా ఎస్‌బీఐ కార్డు యాప్ ద్వారా డిజిటల్ రూపంలో పేమెంట్స్ చెల్లించడం’ అని ఎస్‌బీఐ కార్డు తన పోర్టల్‌లో  తెలియాచేయడం జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: