ప్రముఖ మొబైల్ హ్యా్ండ్‌సెట్స్ తయారీ కంపెనీ షావోమి తన కార్యకలాపాలను విస్తరిస్తూ వస్తోంది. తాజాగా ఫైనాన్స్ రంగంలోకి  అడుగుపెట్టింది. కంపెనీ గత ఏడాదే ఎంఐ క్రెడిట్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఎంఐ క్రెడిట్ ద్వారా 5 నిమిషాల్లోనే, రూ.లక్ష వరకు  లోన్ పొందొచ్చని షావోమి ఇండియా తెలిపింది.

ఎంఐ క్రెడిట్ ప్లాట్‌ఫామ్‌కు ఎంఐ పే యాప్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. ఎంఐ పే అనేది షావోమి సొంత యాప్. దీని ద్వారా యూపీఐ మనీ ట్రాన్సాక్షన్లను నిర్వహించొచ్చు. ఎంఐ క్రెడిట్ అనేది ప్రతేకమైన ప్లాట్‌ఫామ్. ఇక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయలేం. లెండర్లు యూజర్లకు త్వరితగతిన రుణాలు అందించడమే లక్ష్యంగా ఎంఐ క్రెడిట్ రూపొందింది. ఎంఐ క్రెడిట్ ద్వారా పర్సనల్ లోన్స్‌ను యూజర్లు త్వరితగతిన పొందొచ్చు. యూజర్లకు, లెండర్లకు ఎంఐ క్రెడిట్ ప్లాట్‌ఫామ్ వారధిగా పనిచేస్తుంది.ఎంఐ క్రెడిట్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే రియల్‌టైమ్‌లో ఆమోదం లభిస్తుంది. యూజర్లకు రుణాలు అందించేందుకు షావోమి ఎంఐ క్రెడిట్ ప్లాట్‌ఫామ్ కోసం వివిధ ఆర్థిక సంస్థలతో జతకట్టింది. క్రెడిట్ విద్యా, జెస్ట్ మనీ, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, మనీ వ్యూ, ఎర్లీ శాలరీ  వంటి కంపెనీలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

కేవైసీ వెరిఫికేషన్, ఈమ్యాండేట్స్ ద్వారా రీపేయింగ్, మనీ డిస్‌బర్సల్ అన్ని కూడా డిజిటల్‌గానే జరిగిపోతాయి. ఎలాంటి పేపర్ అవసరం లేకుండానే పని పూర్తి అవుతుంది. 18 ఏళ్లకుపైన వయసు ఉన్న వారు అర్హులు. తీసుకున్న రుణాన్ని 91 రోజుల నుంచి 3 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి. రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయని షావోమి భరోసా ఇస్తోంది.  వడ్డీ నెలకు 1.35 శాతంగా ఉంది. ఉదాహరణకు రూ.20,000 రుణం తీసుకుంటే వడ్డీ రేటు 16.2 శాతంగా ఉంటుంది. ఈ లోన్‌ను 6 నెలలలోగా చెల్లించాలి. వడ్డీ రూ.937 అవుతుంది. ఈఎంఐ రూ.3,423. 

ఎంఐ క్రెడిట్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటికే రూ.28 కోట్ల రుణాలను మంజూరు చేశామని షావోమి తెలిపింది.ఎంఐ క్రెడిట్ ప్లాట్‌ఫామ్‌ను కంపెనీ గతంలోనే పైలెట్ ప్రాజెక్ట్‌ కింద లాంచ్ చేసిన విషయం తెలిసిందే. మంజూరు చేసిన రుణాల్లో 20 శాతం మంది రూ.లక్ష వరకు లోన్ తీసుకున్నారు.షావోమి ఎంఐ క్రెడిట్ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం లోన్ పొందడమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఎంఐ క్రెడిట్ యాప్ ద్వారా క్రెడిట్ స్కోర్ కూడా తెలుసుకోవచ్చు. ఎంఐ యూజర్లకు ఎంఐ క్రెడిట్ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: