ఎక్కడ చూసినా ప్రజలు మొబైలు ఉపయోగించడం లేనిదే జీవితము లేదంటూ బ్రతికేస్తున్నారు. రోడ్డుమీద, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, ఏ సెంటర్ లో చూసిన ప్రతి ఒక్కరూ మొబైల్ లో మాట్లాడను నిరంతరము జరుగుతున్న ప్రక్రియ. ప్రపంచం మొత్తం మీద భారత దేశంలోనే మొబైల్‌ డేటా రేట్లు అత్యంత తక్కువగా ఉన్నాయని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలియచేయడం జరిగింది. బ్రిటన్‌కు చెందిన కేబుల్‌.కో.యూకే అధ్యయనంలో ఇది వెల్లడైందని మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్విట్టర్‌లో ఆయన తెలియజేయడం జరిగింది. 

 

 మొబైల్ డాటా కు సంబంధించిన ఒక చార్టును కూడా పోస్ట్‌ చేశారు. దీని ప్రకారం.. ఒక గిగాబైట్‌ (జీబీ) డేటా సగటు ధర భారత్‌లో 0.26 డాలర్లుగా ఉండగా.. అదే బ్రిటన్‌ దేశంలో 6.66 డాలర్లు, పలుకుతున్నది. అమెరికాలో 12.37 డాలర్లుగా ఉండడము గమనార్హం. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది. దీనిని బట్టి ప్రజలు ఎంత డబ్బును మొబైల్ డాటా మీద ఉపయోగిస్తున్నారో అర్థం అవుతున్నది.ఒక్కొక్కరూ 3 ,4 మొబైల్ ఫోన్లను మెయింటెన్ చేయడం చెప్పుకోదగ్గ విషయం. దీని ప్రకారము ఎంత డబ్బు వృధా అవుతున్నది మనము అంచనా వేయవచ్చు. ఇట్లా అనవసర డబ్బుతో పేదవారి అవసరాలు ఎన్నో తీరుతాయి.

 

దేశంలో టెల్కొలు అయినా  భారత్ ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్‌ జియో .. ఏకంగా 50% దాకా టారిఫ్‌లను పెంచు తున్నట్లు ప్రకటించినది. ఈ నేపథ్యంలో మంత్రి యొక్క స్పందన  చాలాప్రాధాన్యం సంతరించుకున్నది. ‘ఈ మొబైల్‌ చార్జీల విషయములో ఇంతకుముందు చాలా కుంభకోణం జరిగినది.ఈసమస్యంతా.. కుంభకోణాలతో అప్రతిష్ట పాలైన యూపీఏ ప్రభుత్వ యొక్క ఘనతే.  దాన్ని తరువాత మేం సరిచేశాం. అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అధిక మొబైల్‌ ఇంటర్నెట్‌ చార్జీలు.. మాత్రము యూపీఏ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ట్రాయ్‌ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది.

 

కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ మాత్రము చాలా కష్టాల్లో కూరుకుపోయింది. బిఎస్ఎన్ఎల్ లో ఉద్యోగస్తులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చని కూడా ప్రభుత్వము ఇచ్చినది. చాలా మంది ఉద్యోగస్తులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఎలాగైతేనేమి ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌/ఎంటీఎన్‌ఎల్‌ను కూడా ప్రొఫెషనల్‌గా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేస్తూ బిఎస్ఎన్ఎల్ ను గట్టెక్కించడానికి కట్టుబడి ఉంది’ అని మంత్రి తెలిపారు. దేశములో వీలైనంత వరకు ప్రజలు బిఎస్ఎన్ఎల్ సంస్థను నష్టాల్లో నుంచి  బయట పడేయడానికి  ప్రయత్నించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: