కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు కొత్త పథకాలను ఆవిష్కరించింది. ఈ స్కీమ్స్ ద్వారా భార్యాభర్తలు నెలకు రూ.100కట్టి, సంవత్సరానికి ఏకంగా రూ.72,000 పెన్షన్ పొందొచ్చు. అదేంటి పైన రూ.200 అని చెప్పి ఇప్పుడు రూ.100 అని అంటున్నాడేంటని ఆలోచిస్తున్నారా? ఒక్కొక్కరు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. భర్యాభర్తలిద్దరూ కలిసి అయితే రూ.200 అవుతుంది. ఇలా ప్రతి నెలా చెల్లిస్తూ వెళ్లాలి. డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా..? ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్, నేషనల్ పెన్షన్ స్కీమ్అనేవి పథకాలు.

 

శ్రమ్ యోగి మాన్‌ధన్, ఎన్‌పీఎస్ పథకాల్లో సులభంగానే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆధార్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా జన్ ధన్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ‘ఈ స్కీమ్స్‌లో చేరేందుకు 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. నెలకు రూ.55 నుంచి రూ.200 మధ్యలో చెల్లించొచ్చు. ఎన్‌పీఎస్, శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్స్‌లో 30 ఏళ్ల వయసు ఉన్న వారు చేరితే అప్పుడు వారి నెలవారీ చందా రూ.100 అవుతుంది. 

 

వీరి సంవత్సర చందా మొత్తం రూ.1,200. స్కీమ్‌లో చేరిన తర్వాత మొత్తంగా చెల్లించే డబ్బు రూ.36,000 అవుతుంది. నెలవారీ చెల్లింపు మాదిరిగానే  స్కీమ్ ఉంటుంది. స్కీమ్స్‌లో చేరిన వారు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ డబ్బులు పొందొచ్చు. నెలకు కనీస పెన్షన్ రూ.3,000. అంటే సంవత్సరానికి రూ.36,000 డబ్బులు వస్తాయి. అంటే మీరు చెల్లించిన మొత్తం ఒక్క ఏడాదిలోనే మీకు పెన్షన్ రూపంలో వచ్చేస్తుంది. స్కీమ్‌లో చేరిన వ్యక్తి ఒకవేళ మరణిస్తే అప్పుడు వారి భాగస్వామికి నెలకు సగం పెన్షన్ అంటే రూ.1,500 వస్తాయి.

 

భార్యాభర్తలు ఇద్దరూ స్కీమ్‌లో విడివిడిగా చేరితే అప్పుడు 60 ఏళ్ల తర్వాత వీరికి నెలకు రూ.6,000 పెన్షన్ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత రోజూవారి ఖర్చులకు ఈ డబ్బులు సరిపోతాయి. వీరిద్దరిలో ఒకరు చనిపోతే అప్పుడు నెలవారి పెన్షన్ రూ.4,500 అవుతుంది. అసంఘటిత రంగంలోని పనిచేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. పీయూష్ గోయెల్ 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్‌లో చేరాలంటే 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి. నెలకు రూ.3,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. మీకు 18 ఏళ్లు ఉంటే నెలకు రూ.55 చెల్లించి రిటైర్మెంట్ (60 ఏళ్లు) తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ తీసుకోవచ్చు. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించొచ్చు. మీకు 25 ఏళ్ల ఉంటే నెలకు రూ.80 చెల్లించాలి. 30 ఏళ్ల ఉంటే రూ.105, 35 ఏళ్ల ఉంటే రూ.150 చెల్లించాలి. వ్యాపారులు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారి వార్షిక టర్నోవర్ 1.5 కోట్లకుపైన ఉండకూడదు.  ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌వో వంటి స్కీమ్స్‌లో ఉన్న వారు ఈ పథకానికి  అనర్హులు. దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ పథకాల్లో చేరొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: