ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ సంఘటన జరిగిన తర్వాత బాటిళ్లలో పెట్రోల్, డీజిల్‌ అమ్మకూడదు అని ప్రభుత్వం అన్ని పెట్రోల్‌ బంకులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఇవ్వని పట్టించుకోని  యాజమాన్యాలు చిల్లర వ్యాపారం ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘దిశ’ సంఘనలోనూ బాటిల్‌ పెట్రోల్‌ అంశం మరోసారి తెరపైకి రావడం జరిగింది. ఇలాంటి వ్యాపారం పెట్రోల్‌ బంకులతో పాటు రోడ్డు పక్కన కూడా అమ్మకాలు కొనసాగుతున్నాయి. నగర శివార్లలో జరిగిన తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం, దిశపై అత్యాచారం, పెట్రోల్‌ పోసి తగలబెట్టడం, తహసీల్‌ ఆఫీసుల్లో పెట్రోల్‌ బాటిల్స్‌తో కలకలం వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం బాటిళ్లలో పెట్రోల్‌ అమ్మకాలపై ఆంక్షలు విధించడం జరిగింది.  


దీంతో తాజాగా పోలీసు విభాగం గట్టి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఖాళీ బాటిళ్లలో పెట్రోల్, డీజిల్‌ పోస్తే శిక్ష తప్పదని హెచ్చరించడం జరిగింది. దీంతో పెట్రోల్‌ బంకుల్లో ‘నో పెట్రోల్‌ ఇన్‌ ప్లాస్టిక్‌ బాటిల్‌’ అనే బోర్డులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇలా ఉండగా... హైదరాబాద్‌ నగరం నడిబొడ్డుతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం రోడ్డు పక్కన పెట్రోల్‌ బాటిళ్లు పెట్టి అమ్మడం చాల సాధారణంగా మారడం జరిగింది. మరోవైపు శివారు ప్రాంతాల్లో సైతం టేబుళ్లపై బాటిళ్లలో పెట్రోల్‌ అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్న తరుణం కనిపిస్తుంది. 

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PETROL' target='_blank' title='petrol-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>petrol</a> bunk


ఒక వేళా ప్రయాణంలో ఉన్నప్పుడు పెట్రోల్‌ అయిపోయి దారిలో వాహనాలు నిలిచిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పటి ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఓ బాటిల్‌ తీసుకుని దగ్గరలోని బంకుకు వెళ్లి పెట్రోల్‌ కొన్నుకొని వచ్చేవారు. కానీ  ప్రస్తుత పోలీస్‌ నిబంధనల నేపథ్యంలో ఇకపై బాటిళ్లలో పెట్రోల్‌ తీసుకెళ్లడం వీలు కాదు. అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్‌ కోసం బాటిల్‌తో వచ్చినవారి వారి పేరు, ఫోన్‌ నంబర్, వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ వంటి వివరాలతో పాటు సదరు వ్యక్తుల ఫొటో సైతం స్మార్ట్‌ ఫోన్‌లో తీసుకుని పెట్రోల్‌ అమ్మవచ్చు అని పోలీసులు తెలియజేయడం జరిగింది.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PETROL' target='_blank' title='petrol-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>petrol</a> bunk

 

వాస్తవానికి బహాటంగా బాటిళ్లలో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు చేయడం చట్ట రిత్యా నేరం. పెట్రోల్‌ బంకుల్లో సైతం బాటిళ్లలో అమ్మకాన్నినిషేధించాం. రోడ్డు పక్కన బాటిళ్లలో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం అని అధికారులు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: