ప్రస్తుతం టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా కంపెనీలు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందిస్తున్న మొబైల్ ప్లాన్ల చార్జిలను పెంచి కొత్త ప్లాన్లను ప్రవేశ పెట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో జియో కంపెనీ కూడా ఆ టారిఫ్‌లను పెంచి పలు నూతన ప్లాన్లను ప్రవేశ పెట్టడం జరిగింది. కొత్తగా ఆలిన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్లను జియో ప్రజలకు  అందుబాటులోకి తీసుకోని రావడం జరిగింది. జియో కంపెనీ ఈ క్రమంలో సదరు ప్లాన్లలో ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసుకునేందుకు గాను ఉచిత ఆఫ్-నెట్ మినట్స్‌ ఆఫర్ ని కూడా ప్రకటించడం జరిగింది. ఇక  జియో ప్రకటించిన నూతన ఆలిన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాల గురించి తెలుసుకుందామా మరి....

 

ముందుగా 28 రోజుల వాలిడిటీ ఉన్న ప్లాన్లు వివరాలు ఇలా...

1. రూ.199 - రోజుకు 1.5 జీబీ డేటా, 1000 ఆఫ్-నెట్ నిమిషాలు
2. రూ.249 - రోజుకు 2 జీబీ డేటా, 1000 ఆఫ్-నెట్ నిమిషాలు
3. రూ.349 - రోజుకు 3 జీబీ డేటా, 1000 ఆఫ్-నెట్ నిమిషాలు

 

ఇక 56 రోజుల వాలిడిటీ ఉన్న ప్లాన్లు వివరాలు ఇలా...

1. రూ.399 - రోజుకు 1.5 జీబీ డేటా, 2000 ఆఫ్-నెట్ నిమిషాలు
2. రూ.444 - రోజుకు 2 జీబీ డేటా, 2000 ఆఫ్-నెట్ నిమిషాలు

 

84 రోజుల వాలిడిటీ ఉన్న ప్లాన్లు వివరాలు ఇలా...

1. రూ.555 - రోజుకు 1.5 జీబీ డేటా, 3000 ఆఫ్-నెట్ నిమిషాలు
2. రూ.599 - రోజుకు 2 జీబీ డేటా, 3000 ఆఫ్-నెట్ నిమిషాలు

 

365 రోజుల వాలిడిటీ ప్లాన్...

1 . రూ.2199 - రోజుకు 1.5 జీబీ డేటా, 12,000 ఆఫ్-నెట్ నిమిషాలు

చివరిగా ఇతర ప్లాన్లు వివరాలు ఇలా...

1. రూ.129 - 2 జీబీ డేటా, 1000 ఆఫ్-నెట్ నిమిషాలు, 28 రోజుల వాలిడిటీ
2. రూ.329 - 6 జీబీ డేటా, 3000 ఆఫ్-నెట్ నిమిషాలు, 84 రోజుల వాలిడిటీ
3. రూ.1299 - 24 జీబీ డేటా, 12,000 ఆఫ్-నెట్ నిమిషాలు, 365 రోజుల వాలిడిటీ

 
ఇంకో శుభవార్త.. జియో కస్టమర్లకు ఈ ప్లాన్లతోపాటు జియో ప్రైమ్ బెనిఫిట్స్, జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, జియో హెల్త్‌హబ్ ఇలా అన్ని యాప్ సేవలును పొందవచ్చు. కాగా ఈ ప్లాన్లు గురువారం (నేటి) అర్ధరాత్రి నుంచి అమలులోకి  వస్తాయి అని అధికారులు తెలియచేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: