ఉల్లిగడ్డ, ఉల్లిపాయి, ఎర్రగడ్డ ఇలా ఇన్ని పేర్లు ఉన్న ఈ ఉల్లి ధర ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. రోజురోజుకు పెరుగుతూనే ఉంది తప్ప ఈ ఉల్లి ధర తగ్గటం లేదు. తగ్గేలా కనిపించడం కూడా లేదు. మలక్ పెట్ మార్కెట్ లో నాణ్యమైన ఉల్లిగడ్డలు క్వింటాల్ ఉల్లి ధర ఆల్ టైం రికార్డ్ ధర పలుకడం విశేషం. ఒక క్వింటాల్ ఉల్లి రూ. 14 వేలు పలికింది.

           

గత నెలలో గరిష్ఠ క్వింటా ధర రూ 6,000 ఉండగా ఈ నెలలో ఏకంగా ఆరు రెట్లు పైగా పెరిగింది. ఇంకా సామాన్యుల దగ్గరకు వచ్చే సరికి ఒక్కో చోటా ఒక్కో ధర అమ్ముతున్నారు. నాణ్యత లేని ఉల్లిపాయలు కిలో ధర రూ.70 ఉండగా, నాణ్యమైన పెద్ద ఉల్లిపాయల ధర కేజీ 170 రూపాయిలు పలుకుతుంది. 

 

ఇంకా నగరాల్లో ఉల్లిపాయ ధర కిలో రూ.150కు చేరిందని జాతీయ ఉద్యాన మండలి తాజా నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు విదేశాల నుంచి లక్ష టన్నుల దిగుమతికి కేంద్రం అనుమతివ్వడమే కాక వాటి నిల్వకు నాణ్యత ప్రమాణాలను సడలించింది. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగుచేసిన ఉల్లి పంట భారీ వర్షాలకు దెబ్బతినడం వల్ల 10 లక్షల టన్నుల వరకు దిగుబడి తగ్గుతుందని అంచనా. 

 

అయితే ఇంత ధర పెరిగినా కూడా హైదరాబాద్‌కు ఉల్లిగడ్డలు ఇతర రాష్ట్రాల నుండి వరదలా వస్తున్నాయి. సామాన్యులకు ఈ ఉల్లి ధర ప్రస్తుతం చుక్కలు చూపిస్తుంది అనే చెప్పాలి. అంతేకాదు ఇప్పుడు కేజీ ఉల్లి ధర మార్కెట్ లో 170 రూపాయిలు పలుకుతుంది. దేశంలో ప్రధాన నగరాల్లో అయితే కిలో ఉల్లి రూ.150కి తక్కువ కాకుండా విక్రయిస్తున్నారు. మరి ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: