స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - ఎస్‌బీఐ యోనో కస్టమర్లకు శుభవార్త. ఎస్‌బీఐ 'యోనో షాపింగ్ ఫెస్టివల్ 2.0' ప్రకటించడం జరిగింది. ఈ ఫెస్టివల్  డిసెంబర్ 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించ బోతున్నారు. ఈ ఫెస్టివల్ లో  భారీ డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ లభిస్తాయి. ఈ ఫెస్టివల్‌లో ఎస్‌బీఐ యోనో కస్టమర్లకు 17 మర్చంట్ పార్ట్‌నర్స్ వేర్వేరు కేటగిరీల్లో 50% వరకు డిస్కౌంట్స్ ప్రకటించడం జరిగింది. ఇంకా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు  అమెజాన్, లైఫ్‌స్టైల్ స్టోర్స్, థామస్ కుక్, ఈజ్ మై ట్రిప్, ఓయో లాంటి 17 ఇ-కామర్స్ మర్చంట్స్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించడం జరిగింది.

 

ఇంకా  ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫర్నీచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ... ఇలా ఎందులో అయినా మీరు 5% నుంచి 50% వరకు డిస్కౌంట్స్ పొందే అవకాశం కలిపిస్తుంది. ఇక ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్స్ అదనంగా 10% క్యాష్‌బ్యాక్ కూడా సులువుగా పొందవచ్చు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది కనీసం రూ.1000 షాపింగ్ కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇలా షాపింగ్ చేస్తే  రూ.2500 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశాలు చాలా ఉన్నాయి.

 

అంతేకాదు అండి... హోమ్ లోన్, ఆటో లోన్స్ పైనా కూడా భారీ ఆఫర్లు ఎస్‌బీఐ ప్రకటించడం జరిగింది. ఇక  2019 డిసెంబర్ 31 వరకు ఆటో లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టవలసిన అవసరం లేదు. మరో వైపు హోమ్ లోన్లపై కన్సాలిడేట్ ప్రాసెసింగ్ ఫీజులో 50% తగ్గింపు కూడా ప్రకటించడం జరిగింది. ఇన్‌స్టంట్ ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ అందించనుంది. గత సంవత్సరం కూడా యోనో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించింది ఎస్‌బీఐ. అప్పుడు జరిగిన ఫెస్టివల్ విజయవంతం అవ్వడంతో ఇప్పుడు 'యోనో షాపింగ్ ఫెస్టివల్ 2.0' ని ప్రకటించడం జరిగింది. మరి ఇక ఎందుకు ఆలస్యం ఈ ఫెస్టివల్లో మీ ఇంటికి కావలసిన వన్నీ కొనుగోలు చేయండి...అధిక డిస్కౌంట్ పొందండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: