గత నెల రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఈరోజు బ్రేకులు పడ్డాయి. ఒకేసారి నాలుగు రూపాయిలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. నిన్న 10 పైసలు నేడు 18 పైసలు పెట్రోల్ పై తగ్గింది. ఏదిఏమైనా ఎంత భారీగా తగ్గింది అనేది కాదు ఇప్పుడు ముఖ్యం కదలకుండా కూర్చున్నా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం ప్రారంభించటం సంతోషకరమైన వార్త అనే చెప్పాలి. 

 

ఇంకా విషయానికి వస్తే హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు తగ్గి రూ.79.56కు వద్ద కొనసాగగా డీజిల్ ధర కూడా 10 పైసలు తగ్గుదలతో రూ.71.63కు చేరుకుంది. కాగా మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇక వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే తగ్గాయి. 

 

అమరావతిలో పెట్రోల్ ధర 79.12 రూపాయలకు దగ్గర, డీజిల్ ధర మాత్రం 71.04 వద్ద కొనసాగగా, విజయవాడలోనూ ఈ పెట్రోల్, డీజల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 74.66 రూపాయిల దగ్గర, డీజిల్ ధర 65.73 రూపాయిల వద్ద కొనసాగుతుంది. 

 

కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.03 శాతం తగ్గుదలతో 62.35 డాలర్లకు క్షీణించింది. అయితే గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు 10, 15 పైసల్ పెరుగుదలతో 4రూపాయిలు పెరిగింది. 

 

పైసలు రూపంలో వాహనదారులకు కనిపించలేదు కానీ నిజానికి పెట్రోల్, డీజల్ ధరలు బాగా పెరిగాయి. అయితే ప్రస్తుతం ఈ పెట్రోల్ డీజల్ ధరలు తగ్గటంతో వాహనదారులు కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఈ పెట్రోల్, డీజల్ ధరలు మునుపటిలా లీటర్ పెట్రోల్ 76 రూపాయలకు ఎప్పుడు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: