టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ డిసెంబర్ 3 నుండి అమల్లోకి వచ్చిన ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం తన కొత్త ప్రణాళికల ప్రకారం ఇతర నెట్‌వర్క్‌లలో ఉచిత  అవుట్‌గోయింగ్  కాల్‌ పై గల క్యాప్ ను  తొలగించింది.   సంస్థ ఇంతకుముందు ఇతర టెలికాం ఆపరేటర్ల నెట్‌వర్క్‌కు అవుట్‌గోయింగ్ కాల్‌ ల పై క్యాప్ విధించింది.  ఈ  క్యాప్ ప్రకారం 28 రోజుల చెల్లుబాటు  ప్లాన్  విషయంలో 1,000 నిమిషాలు, 84 రోజుల చెల్లుబాటు ప్లాన్ లో 3,000 మరియు 365 రోజుల చెల్లుబాటు ప్లాన్ లో 12,000. ఈ పరిమితికి మించి, వినియోగదారులు అవుట్ గోయింగ్  కాల్స్ కోసం నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సి ఉంది.

 

 

 

 

రేపటి నుండి, మా అపరిమిత  ప్లాన్ ల తో  భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌ను ఆస్వాదించండి. ఎటువంటి షరతులు వర్తించవు  అని భారతి ఎయిర్‌టెల్ శుక్రవారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.  అపరిమిత   విభాగంలో 2 రోజులు, 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల చెల్లుబాటుతో కంపెనీ కొత్త ప్రణాళికలను ప్రకటించింది.   

 

 

 

 

 

భారతి ఎయిర్‌టెల్ తన ఎంట్రీ లెవల్ అన్‌లిమిటెడ్ ఏడాది పొడవునా చెల్లుబాటు గల ప్లాన్‌ ధరను 50%  పెంచింది. ఇంతకూ ముందు  ఎయిర్‌టెల్ 998 ప్లాన్ తో 12 జిబి డేటా ను ఏడాది పొడవు ఇచ్చేది, ఇప్పుడు దానిని 1499 కి పెంచి 24  జిబి డేటా ఇవ్వబోతుంది.  రోజుకు 1.5 GB రోజువారీ డేటా వినియోగ పరిమితితో అదే విభాగంలో 365 రోజుల చెల్లుబాటు ప్రణాళిక ధర ఇప్పుడు 41.2% పెంచి   ధర 2,398 గా నిర్ణయించబడింది. 

 

 

 

కాల్ పరిమితిని తొలగించడంతో, 56 రోజుల చెల్లుబాటుతో ఎయిర్‌టెల్ యొక్క కొత్త 399 ప్లాన్‌లు రిలయన్స్ జియో ప్లాన్ కంటే  చౌకగా  మారింది.   చట్టబద్ధమైన బకాయిలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత భారతీ ఎయిర్‌టెల్ సెప్టెంబర్ 30 తో ముగిసిన రెండవ త్రైమాసికంలో, 23,045 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: