ఈ మధ్యకాలంలో మొబైల్ వినియోగదారులకు షాక్ లపైనా షాక్ లు వినిపిస్తున్నాయి. ఆ షాక్ లు చూసి.. ఛీ ఇంకా ఫోన్ వాడటం ఆపేస్తే బాగుండు అనిపించేలా ఆ షాక్ లు తగులుతున్నాయి. అయితే ఆలాంటి షాక్ లకు గుడ్ బై చెప్తూ.. కొత్త వినియోగదారులను తన దగ్గరకు వచ్చేలా గుడ్ న్యూస్ చెప్పింది భారతి ఎయిర్టెల్. అంతటి శుభవార్త ఏంటి అని అనుకుంటున్నారా..

 

ఇంకేం శుభవార్త అండి.. ఎయిర్టెల్ తమ వారి ప్రీపెయిడ్ ప్లాన్లపై ఎఫ్ యూపీ లిమిట్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఎయిర్ టెల్ వినియోగదారులు ఏ నెట్ వర్క్ కు అయినా ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతో ఒకే రీచార్జ్ తో ఎయిర్ టెల్ వినియోగదారులు డేటా, మెసేజ్ లతో పాటు కాల్స్ కూడా చేసుకునేల ఆఫర్ ఇచ్చింది. 

 

ఇన్నాళ్లు ఈ ఆఫర్ ఉన్నప్పటికీ ఒక రెండు నెలల క్రితం ఆ ఆఫర్ తొలిగించి.. కాల్స్ కు సపరేట్ రీఛార్జ్, డేటాకు సపరేట్ రీఛార్జ్ చేసుకోవాలి అని షాక్ ఇచ్చింది. అయితే వినియోగదారులను కాపాడుకోవాలి అనుకుందో ఏమో తెలియదు కానీ అన్ని ఒకే రీఛార్జ్ లో అతి తక్కువ ఖర్చుతో అయ్యేలా ఆఫర్ ఇచ్చింది. దీంతో వారి వినియోగాదారులే కాదు పక్క వారు కూడా ఎయిర్టెల్ లోకి వచ్చేస్తారు అని అంటున్నారు మార్కెట్ నిపుణులు. 

 

దీంతో గత మూడు సంవత్సరాలుగా ఫ్రీగా ఇచ్చిన జియో నెట్వర్క్ ఈ మధ్యనే ఈ చార్జీలను ప్రకటించింది. కాగా వొడాఫోన్ ఐడియాలు ఇప్పటికే నష్టాలలో మునిగితేలుతున్నాయి. అయితే ఈ ఎయిర్టెల్ ఇలా ప్రకటించడంతో వీటికి ఒక రకంగా షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ నెట్ వర్క్ ల్లోనూ ఉచితంగా కాల్స్ చేసుకునే సౌకర్యం లేదు. ఏది ఏమైనప్పటికి ఎయిర్టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పి ప్రత్యర్థి నెట్వర్క్ లకు షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: