దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ ఖాతాదారులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా.. ఈ నెల 10వ తేదీ నుండి అంటే రేపటి నుండి కారు, గృహ, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయని తెలిపింది. ఆ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్ 8 నుంచి 7.90 శాతానికి తగ్గనుంది. 

 

ఈ వడ్డీతో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధామై ఉండే కారు, గృహ, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గతాయని ఎస్‌బీఐ తెలిపింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలా ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఎస్‌బీఐకి ఇది 8వ సారి. ఇక బ్యాంకులకు నిధులు లభించే రేటునే ఎంసీఎల్‌ఆర్ అంటారు. ఈ క్రమంలోనే తాము దేశంలోనే అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలను అందిస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది.

 

అయితే ఈ ఒక్క గుడ్ న్యూస్ మాత్రమే కాదు ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది.. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ఎస్‌బీఐ తన కస్టమర్లకు మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని ఇప్పటికే సూచింది. కస్టమర్ల వద్ద ఉన్న పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవని తేల్చి చెప్పింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు ఎస్‌బీఐ తెలిపింది. 

 

ఈ మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు జరుగుతుండడంతో వాటిని అరికట్టే ప్రయత్నంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. ఇందులో భాగంగా 2016లో అప్పటికి వినియోగంలో ఉన్న మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ ప్రవేశ పెట్టినట్టు చెప్పింది. ఇప్పటికీ కూడా కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లకు వెంటనే బ్యాంక్‌కు వెళ్లి కార్డును మార్చుకోవాలని.. లేదంటే ఇప్పుడు ఉన్న కార్డులు బ్లాక్ అవుతాయని కస్టమర్లకు తెలిపింది. అంటే ఈరోజు ఎస్‌బీఐ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పినట్టే చెప్పి బ్యాడ్ న్యూస్ చెప్పేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: