బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పట్టాయి. ఒకరోజు బంగారం ధర భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. అయితే గత నెల వరుకు భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు గత నాలుగు రోజుల నుండి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే నేడు మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 260 రూపాయిల తగ్గుదలతో 39,270 రూపాయలకు చేరింది. 

 

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 120 రూపాయిల తగ్గుదలతో 36,000 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర 100 రూపాయిలు తగ్గుముఖంతో 46,500 రూపాయిలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

 

కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్ లోను పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిల తగ్గుదలతో 38,050 రూపాయలకు చేరింది. కాగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 120 రూపాయిలు తగ్గుదలతో 37,880 రూపాయలకు చేరింది. 

 

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం బంగారం, వెండి కొనాలనుకునేవారు వెంటనే కోనేయండి. ఎందుకంటే రేపు మళ్ళి ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: