వాహనదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. గత నెల రోజుల నుండి అలుపెరగకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక పైసా.. రెండు పైసలులా పెరుగుతూనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. కేవలం ఒక నెలలో లీటర్ పెట్రోల్ పై 3 రూపాయిలు పెరిగింది అంటే మాములు విషయమా ?

 

76 రూపాయిలు ఉండాల్సిన పెట్రోల్ ధర కాస్త ఇప్పుడు 79 రూపాయిలు అయ్యింది. అయితే ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 10 రూపాయిలు తగ్గినట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. గత సంవత్సరం లీటర్ పెట్రోల్ ధర 87 రూపాయిలు ఉన్నట్టు ఇప్పుడు కేవలం 79 రూపాయిలే ఉంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

అయితే గత సంవత్సరం పెట్రోల్, డీజిల్ ధరలు.. ముంబైలో 90 రూపాయిలు, డీజిల్ 78 రూపాయిలు ఉండగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 82 రూపాయిలు, లీటర్ డీజిల్ 74 రూపాయిలు ఉంది. అదే సమయంలో బెంగుళూరులో లీటర్ పెట్రోల్ 83 రూపాయిలు, లీటర్ డీజిల్ 74 రూపాయిలు ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ 86 రూపాయిలు, లీటర్ డీజిల్ 78 రూపాయిలు, హైదేరాబద్ లో లీటర్ పెట్రోల్ 87 రూపాయిలు, లీటర్ డీజిల్ 80 రూపాయిలు ఉంది. 

 

అయితే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు.. ముంబైలో లీటర్ పెట్రోల్ 80 రూపాయిలు, డీజిల్ 69 రూపాయిలు ఉండగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 75  రూపాయిలు, లీటర్ డీజిల్ 66 రూపాయిలు ఉంది. అదే సమయంలో బెంగుళూరులో లీటర్ పెట్రోల్ 68 రూపాయిలు, లీటర్ డీజిల్ 74 రూపాయిలు ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ 69 రూపాయిలు, లీటర్ డీజిల్ 78 రూపాయిలు, హైదేరాబద్ లో లీటర్ పెట్రోల్ 79 రూపాయిలు, లీటర్ డీజిల్ 72 రూపాయిలు ఉంది. 

 

అంటే ఇప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలు గత సంవత్సరంలోనే ఉన్నాయి.. అయితే ఇప్పుడు మరి దారుణంగా నెల రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు 3 రూపాయిలు పెరిగేసరికి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఏది ఏమైనా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: