నేటితో  (డిసెంబరు 15)  దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల  జాతీయ రహదారులపై ఉండే టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ విధానాన్నిటోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరే సమస్యను తగ్గించాలి అని, సిబ్బంది ఖర్చు తగ్గించుకొనే ఉద్దేశంతో ఫాస్టాగ్ విధానం అమలు లోకి తీసుకొని రావడం జరిగింది కానీ , ఇంకా ఈ విధానానికి సిద్ధంకాని వాహన దారులు తమ ప్రయాణంలో చాల  ఇబ్బందుల ఎదురుకుంటున్నారు. మరి కొన్ని  టోల్‌ గేట్ల వద్ద ఐతే  పాస్టాగ్‌లేని వాహనదారులు టోల్‌ను నగదు రూపంలో చెల్లించేందుకు క్యూ కడుతున్నారు అంటే నమ్మండి. ఈ తరుణంలో  అన్ని ప్రధాన టోల్ గేట్ల వద్దా బాగా రద్దీగా ఉంది.

 

ఇక మరో వైపు రహదారిపై టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ ఉన్న వాహన దారుల కోసం ఎక్కువ సంఖ్యలో లైన్లను కూడా కేటాయించడం జరిగింది. ఒక వేళా  ఫాస్టాగ్ లేని వారి కోసం ఒకటి లేదా రెండు లైన్ల మాత్రమే అనుమతించడం జరిగింది.రద్దీకి ముఖ్య కారణం ఏమిటి అన్న విషయానికి వస్తే  అత్యధిక సంఖ్యలో వాహనదారులు ఫాస్టాగ్ తీసుకోకపోవడం అని అధికారులు తెలుపుతున్నారు. 

 

ముఖ్యంగా  ఫాస్టాగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన లైన్లన్నీ ఖాళీగా ఉండడం, నగదు చెల్లించే లైన్లలో మాత్రం వాహనాలు పెద్ద ఎత్తున రద్దీగా మారడం జరిగింది. ఇక ఏకంగా  సంగారెడ్డి టోల్ గేటు వద్ద ఉన్న మొత్తం 8 లైన్లలో నగదు చెల్లింపులకు కేవలం రెండు లైన్లను మాత్రమే కేటాయించడం జరిగింది. ఇక మరి కొన్ని టోల్‌గేట్ల వద్ద ఐతే  ఫాస్టాగ్ వాహనాలను మాత్రమే అనుమతించడం జరిగింది.

 

ఇందుకు చర్యలు తీసుకుంటూ ఫాస్టాగ్‌కు ఇంకా సిద్ధం కాని వాహనాల కోసం కేంద్రం ఓ అవకాశం కల్పించడం జరిగింది. టోల్‌గేట్ల వద్ద 25 శాతం హైబ్రిడ్‌ లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఫాస్టాగ్ లేకుండా దానికి కేటాయించిన లైన్‌లో వెళ్లేవారికి అపరాధ రుసుముగా రెట్టింపు టోల్‌ వసూలు చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఇంకా ఈ లైన్లలో ఫాస్టాగ్‌తోపాటు ఇతర పద్ధతుల్లోనూ చెల్లింపులు జరిపే అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ... ఈ అవకాశం కేవలం నెలరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు తెలియచేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: