ఈరోజు అనగా డిసెంబర్ 16వ తారీకు నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సఫర్ (NEFT) సేవలు రోజుకి 24 గంటలు పాటు అందుబాటులో ఉంటాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో ఈ మార్పులను పేర్కొంది. ఇంతకు ముందులాగా కాకుండా.. నిరంతరాయంగా నెఫ్ట్ సేవలను అందించనుంది. గతంలో బ్యాంకులు తెరిచి ఉన్న సమయంలోనే నెఫ్ట్ లావాదేవీలు జరిగే విధంగా టైమింగ్స్ ఉండేవి. ఎలా అంటే... ఉదయం ఎనిమిది గంటలకు నెఫ్ట్ సేవలు స్టార్ట్ అయితే... సాయంత్రం ఏడున్నర గంటల వరకు అందుబాటులో ఉండేవి. మొదటి మూడు శనివారాల్లో... ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 16 నుంచి... 365 రోజుల పాటు... ప్రతిరోజు 24 గంటలూ నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉంటూనే ఉంటాయి.



ఒకవేళ బ్యాంకులు మూసి ఉన్నా.. స్ట్రైట్ త్రూ ప్రాసెసింగ్‌(ఎస్‌టీపీ) ప‌ద్ధ‌తిలో ఆటోమేటెడ్ నెఫ్ట్ లావాదేవీలు జరుగుతాయి. డబ్బులు నిర్వహణను సమర్ధవంతం చేసేందుకు, డిజిటల్ ట్రాన్సఫర్/ లావాదేవీలను ఎంకరేజ్ చేసేందుకు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు వెల్లడించింది. సో, మీరు నెఫ్ట్  సేవలను వినియోగించుకొని డబ్బులను రోజులో ఎటువంటి సమయంలోనైనా ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. నెఫ్ట్‌ విధానంలో ఖాతాదారులు గరిష్టంగా రూ.2 లక్షల వరకు నగదు బదిలీ చేసుకొనే వెసులుబాటు ఉంది. అంతకుమించి లావాదేవీలు చేసుకునేవారు 'ఆర్ టి జి ఎస్'ను వినియోగించుకోవచ్చు. అయితే ఇతర బ్యాంకులు 10 నుంచి 15 లక్షల వరకు నగదు బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. జనవరి 2020 నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు ట్రాన్స్ ఫర్ చార్జీలను ఉచితంగా అందించవలసిందిగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర బ్యాంకులను కోరింది. ముఖ్య విషయం ఏమిటంటే... మీరు నెఫ్ట్ ద్వారా ఉదయం 9 గంటల సమయంలో ఒక వ్యక్తి అకౌంట్ కు కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే... ఆ అమౌంట్ రాత్రి 9 గంటల 15 నిమిషాలకు ఆ వ్యక్తి అకౌంట్లో జమ అవుతాయి.



ఇకపోతే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... ఇతర బ్యాంకులకు నెఫ్ట్ సేవలను నిరంతరాయంగా అందించేందుకు తగు చ‌ర్యలు ప్రారంభించాలని, అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: