ప్రముఖ టెలికాం సంస్థ ఐన ఎయిర్ టెల్ మరో సర్వీస్ ను ఉచితంగా ఇవ్వబోతుంది. వింక్ మ్యూజిక్ అనే యాప్ కు సంబంధించిన సబ్ స్క్రిప్షన్ ను కొందరు వినియోగదారులకు ఉచితంగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సర్వీస్  ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ లాభాల కింద కస్టమర్లకు  అందించబోతుంది.నిజానికి  ఈ యాప్ ను సబ్ స్క్రైబ్ చేసు కోవాలంటే  నెలకు రూ.99 కట్టాలి. కానీ ఇప్పుడు కస్టమర్లకు  ఈ సర్వీస్ ని కస్టమర్లకు   ఫ్రీగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

ఇక వింక్ మ్యూజిక్ గురించి తెలుసుకుందామా మరి.. ఆన్ లైన్ మ్యూజిక్ ను ఎక్కువగా స్ట్రీమింగ్ చేసేవారికి వింక్ మ్యూజిక్ గురించి ప్రత్యేక పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రముఖ ఆన్ లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసుల్లో వింక్ కూడా చాల ప్రముఖమైనది.  ఈ వింక్ మ్యూజిక్ ద్వారా  తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, పంజాబీ, భోజ్ పురి, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, రాజస్తానీ, మరాఠీ, ఒరియా వంటి స్థానిక భాషలకు సంబంధించిన పాటలు కస్టమర్ల సులువుగా వినవచ్చు.  ఈ యాప్ కు సంబంధించిన ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను తీసుకున్నట్లయితే.. ఇందులో ఉన్న పాటలను యాడ్స్ లేకుండా కూడా వినే అవకాశం ఉంది. 


ఈ లాభాలు ​గోల్డ్, సిల్వర్ వినియోగదారులకు మాత్రమే.. గోల్డ్ టైర్ లాభాల కింద రూ.150 ఫాస్టాగ్ క్యాష్ బ్యాక్, షా అకాడమీలో నాలుగు వారాల కోర్సులు, వింక్ మ్యూజిక్ సాధారణ సబ్ స్క్రిప్షన్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ యాప్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్లు ఉచితంగా ఇస్తుంది . చివరిగా సిల్వర్ విభాగం వినియోగదారులకు ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ లాభాలు, వింక్ మ్యూజిక్ యాప్ లాభాలు మాత్రమే పొందుతారు అని సంస్థ తెలియచేసింది. ఇంకా  ఎందుకు ఆలస్యం ఈ ఆఫర్ ని త్వరగా పొందండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: