ప్రముఖ చైనా మొబైల్‌ సంస్థ ఐన షావోమికి షాకిచ్చేలా మరో చైనా మొబైల్‌  మేకర్‌ ఒప్పో రంగం సిద్ధం చేయడం జరిగింది. షావోమి తాజాగా  భారత వినియోగదారులకు చిన్న చిన్న అప్పులిచ్చేందుకు షావోమి ప్రవేశపెట్టిన ‘ఎంఐ క్రెడిట్‌‌‌‌’ లాగా ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంను రియల్‌మి తాజాగా లాంచ్‌ చేయడం జరిగింది. రియల్‌ మి కూడా  పేసా పేరుతో భారత మార్కెట్లో రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 

 

దీనికోసం  ఫిన్‌టెక్ స్టార్టప్ఫిన్‌షెల్‌తో భాగస్వామ్యం ఒప్పందం చేసుకుంది. దేశంలో దీని ద్వారా వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎస్‌ఎంఇ) లావాదేవీలను చాల సులభంగా చేయడంతోపాటు, తమ వృద్ధిని బలపేతం చేయాలనే రియల్‌మి ముఖ్య లక్ష్యం. ఈ విషయాన్ని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్‌ సేత్‌ ప్రకటించడం జరిగింది. మేము ముఖ్యంగా టైర్-1, టైర్- 2 పట్టణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాము అని   తర్వాత ఇతర పట్టణాలకు కూడా సదుపాయం కలిపిస్తాము అని తెలిపారు.

 

ఇంకా రియల్‌మి పేసా వ్యక్తులు, సంస్థలకు చాలా రకాల ఆర్థిక సేవలను వినియోగదారులకు అందిచడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ని  నేరుగా  గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్  చేసుకోవచ్చు అని తెలిపింది. ఇక  రియల్‌మి  పేసా వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం..  వినియోగదారులు రూ .50 వేల వరుకు పర్సనల్‌ లోన్‌ పొందే అవకాశం కూడా ఇస్తుంది అని తెలియచేయడం జరిగింది.  పేసాలోని లెండింగ్‌కార్ట్ ద్వారా సంస్థలు రూ. 50 వేల నుంచి రూ. 20 లక్షల వర​కు రుణం పొందే అవకాశం ఉంది అని తెలియచేయడం జరిగింది. 

 


ఇక  2023 నాటికి ఇండియాలో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్రెడిట్‌‌‌‌ లెండింగ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ రూ. 70 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాలు వేస్తున్నారు సంస్థ వాళ్ళు. ఈ నేపథ్యంలో  2019 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎంఐ క్రెడిట్ ద్వారా భారతదేశంలో 19,000 పిన్ కోడ్‌లను కవర్  చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అధికారులు వెల్లడిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: