ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా దాదాపు రెండు దశాబ్దాలు నిలిచిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఆ స్థానాన్ని రెండు సంవత్సరాల కిందట అమెజాన్ కంపెనీ అధినేత  జెఫ్ బెజోస్ ఆక్రమించారు. అసలు ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా ఎదిగాడో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా 1994లో ఒకసారి సెకండ్ హ్యాండ్ బుక్ షాపింగ్ అమెజాన్ పేరుతో ఆయన నడిపేవారు. అలాంటి వ్యక్తి 2018 వచ్చేసరికి ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీ అమెజాన్ ఎదిగేలా చేశారు.

 

అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటి ట్రిలియన్ డాలర్ కంపెనీగా నిలిపిన ఘనత ఆయనకే చెందుతుంది. దానితో పాటు ప్రపంచ అపర కుబేరుడు గా ఆయన మొదటి స్థానాన్ని కొల్లగొట్టారు. దీనంతటికీ కారణం కూడా ఆయన భవిష్యత్తు అవసరాలను గుర్తించడమే అని ఆయన చెప్తూ ఉంటారు. 1994 లోనే ఆయన షాపింగ్ మాల్స్ తమ ఉన్నతిని కోల్పోతాయని చెప్పారు . అప్పట్లోనే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చే వస్తువుల మీద వ్యాపారానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని గ్రహించాడు.

 

ఆయన ప్రిన్స్టన్ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ను అభ్యసించాడు. తర్వాత డీఈ షా హెడ్జ్ ఫండ్ లో ఉద్యోగంలో చేరాడు అక్కడ పనిచేస్తున్నారు. అక్కడే ఆయనకు ఆయన భార్య మెకంజీ పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎంతో ధైర్యంతో 1995లో ఏడు లక్షల రూపాయలతో అమెజాన్ని ప్రారంభించారు.

 

 ప్రారంభించిన నెల రోజుల్లో దాదాపు 50 రాష్ట్రాలూ రాష్ట్రాలలో 45 దేశాలలో ఆయన తన కార్యకలాపాలను ప్రారంభించాడు. కేవలం మొదటి ఐదు సంవత్సరాలలోనే తన అమ్మకాలను 10వేల కోట్లకు పెంచగలిగారు. 1997లో కంపెనీ దాదాపు 350 కోట్లు నిధులని ప్రజల నుంచి సేకరించికలిగింది. 2018లో అమెజాన్ దాదాపు 17 వేల కోట్ల లాభాలను ఆర్జించింది. అమెరికా లాంటి పెద్ద దేశంలో మొత్తంగా జరిగే ఆన్ లైన్ అమ్మకాల్లో సగం భాగం అమెజాన్ వే. గత సంవత్సరంలో ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు దీనివల్ల ఆయన తన వాటాని కోల్పోవాల్సి వచ్చింది. దీనివల్ల ఆయన తిరిగి సంపన్నుల లిస్టులో రెండవ స్థానానికి రావలసి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: