భారత దేశ జనాభా దాదాపు 130 కోట్లు, ఇందులో కార్లు వాడే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఇక్కడ కార్లు వాడే సంఖ్య కొన్ని దేశాల్లో జనాభా కంటే ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఈ దేశంలో అన్ని కంపెనీలు కూడా విజయం సాధిస్తాయని నమ్మకం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంతే కాకుండా కారు ధర, ఇంధన సామర్థ్యం, తిరిగి అమ్మకం విలువ, సర్వీసింగ్, సౌకర్యాలు ఎంత అందుబాటులో ఉన్నాయి అంశాలు  తీసుకున్న తర్వాతనే ఆ కంపెనీ ఇక్కడ నిలబడ కలుగుతుంది.

 

 ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల కంపెనీలో ఒకటి అయిన జనరల్ మోటార్స్ భారతదేశంలో అంతగా విజయం సాధించలేదనే చెప్పాలి. 1996లో ఒపెల్ బ్రాండ్ తో ఇండియా లోకి ప్రవేశించిన జనరల్ మోటార్స్ మొదటి అడుగులోని తప్పటడుగు వేసింది. ఆ తర్వాత 2004లో వచ్చిన టవేరా ఓ మోస్తరు విజయం సాధించింది. కానీ ఆ తర్వాత వచ్చిన అరడజను పైగా మోడల్ భారత దేశ ప్రజలను మెప్పించలేకపోయారు. అప్పట్లో అతి చిన్న డీజిల్ కారు గా బీట్ సంచలనం సృష్టించింది ఇది జనరల్ మోటార్స్ వారిదే.

 

తక్కువ ధరలో డీజిల్ కార్లు ఇవ్వాలనే లక్ష్యంతో చైనా భాగస్వామితో కలిసి 2013 లో సెయిల్ అని మోడల్ని తీసుకొచ్చింది. కానీ ఇది కూడా విజయం సాధించలేదు. ఆ తరువాత చివరికి 2017లో భారత్లో తన విక్రయాలను నిలిపివేసింది జనరల్ మోటార్స్. 1995లో ఫోర్డ్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తో కలిసి భారత్ లో వ్యాపారం ప్రారంభించింది. 24 సంవత్సరాల పాటు భారతదేశం మార్కెట్లో ఉన్న కూడా ఇప్పటికీ కేవలం మూడు శాతం వాటాను మాత్రమే ఫోర్డ్ దక్కించుకోగలిగింది.  

 

ఆటోమొబైల్ రంగంలో మందగమనం వస్తున్న వేళ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి మరో దేశీయ దిగ్గజం అవసరం  తప్పనిసరిగా మారింది ఫలితంగా మళ్లీ మహీంద్రా తో కలిసి జాయింట్ వెంచర్ ని అక్టోబర్లో ఏర్పాటు చేసింది. నిజానికి టాటా మోటార్స్ ని కూడా రతన్ టాటా ఫోర్డ్ కి  అమ్మాలని అనుకున్నారు. కానీ వారు ప్రవర్తించిన తీరు పట్ల మనస్థాపానికి గురై ఆ కంపెనీని పట్టుదలగా నడిపి భారత్ మార్కెట్లో నిలదొక్కుకునేలా చేశాడు. చివరికి మళ్లీ అదే ఫోర్డ్ కి చెందిన జేఎల్ఆర్ కంపెనీని కొనుగోలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: