సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ను ఆడపిల్లల ఆర్థిక భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మెరుగైన భవిష్యత్తును ఆడపిల్లలకు ఇవ్వటం కొరకు ఈ స్కీమ్ ద్వారా వారి పేరుపై డబ్బు డిపాజిట్ చేయవచ్చు. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో డబ్బులను డిపాజిట్ చేస్తే డిపాజిట్ చేసిన డబ్బుకు పూర్తి రక్షణతో పాటు ఆకర్షణీయమైన రాబడి కూడా ఉంటుంది. 
 
పది సంవత్సరాల లోపు వయస్సు గల ఆడపిల్లలు ఈ స్కీమ్ లో చేరటానికి అర్హులు. ఆడపిల్ల పుట్టినతేదీ ధ్రువపత్రం, తల్లిదండ్రుల ధ్రువపత్రాలు ఈ పథకంలో చేరటానికి అవసరం. బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపు తరువాత ఈ అకౌంట్లలో వడ్డీ జమ అవుతుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లపై 8.4 శాతం వడ్డీ లభిస్తుండగా ప్రతి మూడు నెలలకు వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. 
 
ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 250 రూపాయల నుండి గరిష్టంగా లక్షన్నర రూపాయలు డిపాజిట్ చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో డిపాజిట్ చేసిన డబ్బుకు ఎలాంటి పన్ను ఉండదు. ఖాతా తెరిచిన రోజు నుండి 15సంవత్సరాల వరకు డబ్బును డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. 
 
నెలకు 3,000 రూపాయలు సుకన్య సమృద్ధి ఖాతాలో జమ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 16 లక్షల రూపాయలను పొందవచ్చు. నెలకు 6,000 రూపాయల చొప్పున జమ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 33 లక్షల రూపాయలు పొందవచ్చు. సుకన్య సమృద్ధి స్కీమ్ ద్వారా ఏకంగా 73 లక్షల రూపాయలు కూడా పొందవచ్చు. నెలకు 12,000 రూపాయల చొప్పున సుకన్య సమృద్ధి ఖాతాలో జమ చేస్తే ఏకంగా 73 లక్షల రూపాయలను పొందవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: