డబ్బు ఈజీగా సంపాదించాలని అనుకుంటున్నారా ? కానీ మార్గం తెలియదా ? అయితే మీ కోసమే ఒక సూపర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఆ సూపర్ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి బాబు.. చేతిలోని డబ్బును డిపాజిట్ చెయ్యడంతో అదిరిపోయే రాబడి పొందవచ్చు. అసలు ఈ డిపాజిట్ ఏంటి ? ఎందుకు అదిరిపోయే రాబడి వస్తుంది అని అనుకుంటున్నారా ? 

 

వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర ప్రభుత్వం తాజాగా నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఈ స్కీమ్‌కు ఆమోదం లభించింది. అయితే ఈ  స్కీమ్‌లో నాలుగు రకాల అకౌంట్లు ఉంటాయి. ఆ అకౌంట్లు ఏంటి అంటే ? ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లు కాల పరిమితిలో అకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న కాలపరిమితికి అనుగుణంగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

 

టైమ్ డిపాజిట్ అకౌంట్‌ను ఎవరైనా ప్రారంభించచ్చు. ముగ్గురు కలిసి కూడా ఈ అకౌంట్‌ను తెరవచ్చు. అలాగే ఈ అకౌంట్ ను పదేళ్లలోపు మైనర్ల పేరుపై కూడా తెరవచ్చు అయితే ఈ మైనర్ అకౌంట్లకు గార్డియన్ అవసరం ఉంటుంది. అయితే ఈ అకౌంట్లు ఒక వ్యక్తి ఒకటికన్నా ఎక్కువ అకౌంట్లను ప్రారంబించచ్చు. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో కనీసం రూ.1,000 డిపాజిట్ చేసిన సరిపోతుంది. 

 

ఇక అకౌంట్‌లో ఎంత మొత్తానైనా డిపాజిట్ చెయ్యచ్చు. వీటికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. టీడీ అకౌంట్‌పై వడ్డీ రేట్లు మీరు ఎంచుకున్న కాల పరిమితి బట్టి ప్రాతిపదిక మారుతుంది. కాగా నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌లోని డిపాజిట్లకు వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి జమవుతూ వస్తుంది. అయితే వడ్డీ మొత్తాన్ని సంవత్సరం చివరిలో విత్‌డ్రా చేసుకోవచ్చు. 

 

ఒకవేళ మీరు డబ్బు విత్‌డ్రా చేసుకోకపోతే దానిపై మీకు తర్వాత ఎలాంటి అదనపు వడ్డీ రాదు. ఐదేళ్ల అకౌంట్‌ను ఓపెన్ చేసి దాన్ని నాలుగేళ్లకు క్లోజ్ చేస్తే అప్పుడు మీకు మూడేళ్ల అకౌంట్‌కు వర్తించే వడ్డీ రేటు మాత్రమే వస్తుంది. ముందుగా చెల్లించిన వడ్డీ మొత్తాన్ని కొత్త వడ్డీ రేటు ప్రాతిపదికన మళ్లీ డెబిట్ చేసుకుంటారు. కాబట్టి ముందుగానే అకౌంట్ క్లోజ్ చేసుకోవడం వల్ల నష్టం వస్తుంది. అందుకు గాను అకౌంట్ చేసే ముందే సమయాన్ని ఎంచుకోవడం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: