బంగారం ధర.. ఒకరోజు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో అయితే తగ్గింది మళ్ళి రెండింతలు పెరిగే వరుకు వెనకడుగు వెయ్యటం లేదు బంగారం ధర. దీంతో బంగారం ధరలు కొనే వారు ఆశ్చర్యానికి గురై బంగారం కొనాలనుకునే వారు కూడా వెనక్కి వెళ్లిపోయారు. ఆలా రోజు రోజుకు బంగారం ధర భారీగా పెరుగుతూనే ఉంది. 

                        

గత నెల వరుకు భారీగా పెరిగిన బంగారం ధర వారం రోజుల నుండి తగ్గుముఖం పట్టింది. అయితే ఈరోజు మళ్ళి యధావిధిగా పెరగడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే నేడు శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 370 రూపాయిల పెరుగుదలతో 40,330 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 320 రూపాయిల పెరుగుదలతో 36,970 రూపాయలకు చేరింది. 

               

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర 500 రూపాయిలు భారీ పెరుగుదలతో నేడు 47,800 రూపాయిలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా పెరగటంతో బంగారంపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.05 శాతం తగ్గుదలతో 1,467.85 డాలర్లకు పుంజుకుంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: