బిర్యానీ అంటే ఎవరికీ నూరు ఊరాడో చెప్పండి. పండుగ అయినా పబ్బం అయినా సందర్భం ఏదైనా ప్రతి ఫంక్షన్ లోనూ బిర్యానీ ఇప్పుడు కామన్ అయిపొయింది. ఇక హోటల్ లో నోరూరించే రకరకాల బిర్యానీలపై ఎవరికి మక్కువ ఉండదో చెప్పండి. ఆవురావురమంటూ వేడి వేడి బిర్యానీ తినేవారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తీసుకునే ఆహరం కూడా చికెన్ బిర్యానీనే. ఈ బిర్యానీ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుండడంతో ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే సంస్థలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. 

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికెన్ ధరలు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిందే. తక్కువ ధరకు చికెన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందా అంటూ నెటిజన్లు యాప్స్ పై కూడా ఆధారపడి తెగ వెతికేస్తుంటారు. అటువంటిది కేవలం 15 రూపాయలకే చికెన్ బిర్యానీ అంటూ ఓ హోటల్ ఆఫర్ ప్రకటించడంతో జనాలు అక్కడకి క్యూ కట్టేస్తున్నారు. 

 

చీకే బిర్యానీ 15 , ఎగ్ బిర్యానీ రూ. 10 కే ఇస్తుండడంతో ఆ హోటల్ ముందు భారీ క్యూ కట్టారు భోజన ప్రియులు.  నష్టం వచ్చినా లెక్కచేయకుండా తన హోటల్ కి మంచి పేరు రావాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు హోటల్ యజమాని. ఇంతకీ ఈ హోటల్ ఎక్కడ ఉంది అనే కదా మీ డౌట్ ? తమిళనాడులోని కోయంబత్తూరులో

మరింత సమాచారం తెలుసుకోండి: