ఎంతోమందికి సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలని ప్లాన్ ఉంటుంది. ఆలా కళ ఉన్నప్పటికీ అది నెరవేర్చుకోలేరు. అయితే అలాంటి వారి కల నెరవేరడం కోసం కొన్ని బ్యానుకులు రుణాలు ఇస్తుంటాయి. కానీ ఆ రుణాల వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే అలా ఎక్కువ వడ్డీ రేట్లు కాకుండా అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తుంది ఎల్ఐసి. 

 

ఇంకా అసలు విషయంకు వస్తే.. సొంతింటి కల నెరవేర్చుకోవాలి అనుకునే వారికీ ఎల్ఐసి బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతి తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ రుణాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను ఇప్పటికే తగ్గిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ఇప్పుడు ఎల్ఐసి హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.1 శాతం నుంచి ప్రారంభమౌతోంది. 

 

హోమ్ లోన్ తీసుకోవాలని అనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గృహ సిద్ధి పేరుతో 8.1 శాతం వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ అందిస్తుంది. 30 ఏళ్ల కాల పరిమితితో హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు. లేదంటే రుణ గ్రహీతకు 60 ఏళ్లు వచ్చే వరకు లోన్ టెన్యూర్ నిర్ణయించుకోవచ్చు. అదే మహిళలు హోమ్ లోన్ తీసుకుంటే.. వీరికి వడ్డీ రేటులో కొంత మేర తగ్గింపు కూడా లభిస్తుంది. 

 

లోన్ తీసుకున్న తర్వాత మీ చేతికి డబ్బులు వస్తే.. రుణాన్ని లోన్ టెన్యూర్ కన్నా ముందుగానే తిరిగి చెల్లించొచ్చు. నిర్మాణంలో ఉన్న ఇంటి కోసం లేదంటే కత్ ఫ్లాట్ కొనుగోలుకు, ఇంటి మరమత్తులకు హోమ్ లోన్ తీసుకోవచ్చు. ఒక్క ఎల్ఐసి మాత్రమే కాదు డి దిగ్గజ బ్యాంక్ ఎస్బిఐ కూడా తాజాగా హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే రుణాలు తీసుకోండి. సొంత ఇంటి కల నెరవేర్చుకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: