ఎంతో మంది ప్రజలకు డబ్బు ఆదా చెయ్యడం సాధ్యం కాదు.. అందుకే అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈపీఎఫ్ సేవలను అందిస్తుంది. ఎంప్లొయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ పీఎఫ్ అకౌంట్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. అయితే తక్కువ వేతనం ఉన్నవారు రిటైర్మెంట్ సమయానికి కోటి రూపాయిలు ఆదా చేసుకోవడం చాలా కష్టం.     

 

కేవలం ఫిఎఫ్ పై ఆధారపడితే ఇది సాధ్యం కాదు. అందుకే ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చెయ్యడం ఎంతో మంచిది. ఉద్యోగుల బేసిక్ వేతనంలో 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమవుతుంది. కంపెనీ కూడా ఉద్యోగి పేరుపై ఇదే మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఇక్కడ మొత్తం కంట్రిబ్యూషన్ ఈఫిఎఫ్ అకౌంట్ కు వెళ్లదు. నిబంధనల ప్రకారం కంపెనీ కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఈఫిఎస్ కు వెళ్లిపోతుంది. మిగిలిన బ్యాలెన్స్ అంత పీఎఫ్ ఖాతాలో చేరుతుంది. 

 

ఉదాహరణకు ఒక వ్యక్తి జీతం 60 వేలు అనుకుంటే.. అపుడు ఆ వ్యక్తి బేసిక్ శాలరీ రూ.25,000 ఉంటుంది. అప్పుడు ఈపీఎఫ్, ఈపీఎస్ కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే.. ఉద్యోగి పీఎఫ్ అకౌంట్‌కు రూ.3,000 జమ అవుతుంది, కంపెనీ పీఎఫ్ రూ.1,750లు, ఈపీఎస్ కంట్రిబ్యూషన్ రూ.1,250లు ఉంటుంది. అప్పుడు ఉద్యోగి మొత్తం పీఎఫ్ కంట్రిబ్యూషన్ నెలకు రూ.4,750 అవుతుంది.

 

ఈ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై 8.5 శాతం వడ్డీ రేటు వస్తే.. ఉద్యోగి మరో 25 ఏళ్లలో రిటైర్మెంట్ అవుతే అప్పుడు మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ దాదాపు రూ.50 లక్షలు అవుతుంది. పీఎఫ్ వడ్డీ అనేది అకౌంట్‌లోని రన్నింగ్ బ్యాలెన్స్ ప్రాతిపదికన లభిస్తుంది. ఈ 50 లక్షలతో పాటు ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్ లో 2వేల రూపాయిల లెక్క ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు 50 లక్షలు వస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: