పసిడి ధరలు రోజుకు ఒకల ఉంటున్నాయి. ఎప్పుడు ఎలా పెరుగుతాయో.. ఎలా తగ్గుతాయో తెలియటం లేదు. అసలు ఇప్పటికి మధ్యతరగతి వారికీ ఈ బంగారం ధరలు అందకపోగా మొన్నటి వరకు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొత్త పండుగా భారీ తగ్గుదలతో ప్రారంభమైంది. నిన్నటి వరుకు పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవటంతో పసిడి ప్రియులు సంబరాలు చేసుకుంటున్నారు. 

 

ఈ నేపథ్యంలోనే నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల తగ్గుదలతో 40,660 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయిల తగ్గుదలతో 37,220 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర పైకి కదిలింది. 

 

దీంతో కేజీ వెండి ధర 50 రూపాయిలు పెరుగుదలతో 49,350 రూపాయిలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: