అన్నదాతలకు మోడీ చల్లటి వార్త చెప్పాడు. ఆ వార్త వింటే ఎవరైనా సరే ఆనందంలో మునిగి తేలుతారు. అంతటి చల్లటి వార్త ఏంటి అనుకుంటున్నారా ? ఇంకే వార్త అదేనండి. న్యూ ఇయర్ గిఫ్ట్ గా రైతులకు మోడీ సర్కార్ ఇస్తున్న గిఫ్ట్ ఇది. ప్రధాని మోదీ రైతులకు కొత్త ఏడాది కానుకగా రూ.2,000 అందిస్తున్నారు. 

 

రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పథకమైన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధులను జనవరి 2న అంటే రేపు మరోసారి విడుదల చేయాలనుకుంటుంది కేంద్రం. రైతుల కోసం రూ.12 వేల కోట్లు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. డిసెంబర్ 1 నుంచి రూ.2,000 డబ్బులు పొందని రైతులకు ఈ డబ్బులు వారి అకౌంట్లలో జమయ్యే అవకాశముంది. 

 

దీంతో.. దేశవ్యాప్తంగా సుమారు 6.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. కాగా, లబ్ధిదారులు నగదు పొందాలంటే డిసెంబర్‌ 1నే వారి బ్యాంకు ఖాతాను ఆధార్‌తో ఇప్పటికే అనుసంధానం చేసుకొని ఉండాలి. మరోవైపు.. రైతులు సాగు చేసుకునేందుకు వీలుగా... ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వం రైతు బంధు, వైఎస్సార్‌ రైతు భరోసా పథకాల ద్వారా రైతులకు ఆర్ధికంగా అండగా ఉన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఈ వార్త కొత్త సంవత్సరంలో రైతులకు తియ్యటి వార్త అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: