భారతీయులకు తియ్యటి శుభవార్త చెప్పింది మలేసియా. ఆ వార్త ఏంటి అంటే ? భారతీయులు కొందరు ప్రపంచ పర్యాటకులు ఉంటారు.. వారికీ పర్యటించడం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అలాంటి పర్యాటకుల కోసమే ఈ చల్లటి వార్త. మలేసియా చూడాలి అనుకున్న వారికీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. 

 

అది ఏంటంటే.. 2020లో మలేసియా దేశాన్ని సందర్శించే ప్రయాణికులకు వీసా అవసరం ఏ మాత్రం లేదు. ఈ ఏడాదిలో 15 రోజులు ఆ దేశాన్ని సందర్శించచ్చు. ఎలక్ట్రానిక్ ట్రావెల్ రిజిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ ద్వారా మలేసియాలో పర్యటించవచ్చు. స్టార్ ఆన్‌లైన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. వీసా అవసరం లేకుండా ప్రయాణించే పర్యాటకులు తగిన గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. 

 

ఆ దేశంలో ఖర్చుల కోసం తగిన డబ్బు ఉన్నట్లుగా ఆధారాలు ఇవ్వాలి. మలేషియా ఎందుకు వెళ్తున్నారు.. ఏం చెయ్యడానికి వెళ్తున్నారు అన్నాడు స్పష్టంగా తెలియజేయాలి. రిటర్న్ టికెట్ కూడా వారికీ చూపించాలి. అయితే రిజిస్టర్ చేసుకున్న మూడు నెలల తర్వాత పర్యాటనకు వారు అనుమతిని ఇస్తారు. 

 

15 రోజుల తర్వాత టూర్‌ను పొడిగించుకోవడానికి అనుమతి ఉండదు. 2020లో విదేశీ పర్యాటకుల సంఖ్య 30 మిలియన్‌కు చేరాలనేది ఆ దేశం లక్ష్యం. ఈ నేపథ్యంలో జనాభా ఎక్కువగా ఇండియా, చైనాలను లక్ష్యంగా చేసుకుని ఈ మలేసియా ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ బంపర్ ఆఫర్ పర్యాటకులకు ఎంతో ఆనందకరమైన వార్త అనే చెప్పాలి. 

 

ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఆఫర్ ను ఉపయోగించండి.. మలేషియాని చూసి వచ్చేయండి. ఈ సూపర్ బంపర్ ఆఫర్ తో మీ ఫ్యామిలీతో మలేషియాని చుట్టేయండి. ఇప్పుడు అప్లై చేసుకుంటే వేసివి సమయానికి మీరు టూర్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: