ఈ మధ్యకాలంలో టీవీ యూజర్లు బాగా తగ్గిపోయారు. కారణం చేతిలోకి స్మార్ట్ ఫోన్ రావడమే. టీవీ యూజర్లు తగ్గినప్పటికీ కావలసిన వారంతా ఈ ఆఫర్ ను యూజ్ చేసుకోండి అంటూ టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా డీటీహెచ్, కేబుల్ టీవీ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో కొత్త ధరల విధానంను ఆవిష్కరించి విమర్శల పాలైన ట్రాయ్ ఇప్పుడు మళ్లీ ధరల విధానంలో పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. 

 

ట్రాయ్ మూడు కొత్త నిర్ణయాలు తీసుకుంది. ట్రాయ్ డీటీహెచ్ అండ్ కేబుల్ టీవీ రెగ్యులేషన్స్ మార్పు వల్ల డీటీహెచ్, కేబుల్ టీవీ యూజర్లకు భారీగా భారం తగ్గనుంది.  కొత్త నిర్ణయంతో నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు బాగా తగ్గనుంది. అంతేకాదు.. ఆపరేటర్లు దీర్ఘకాల ప్లాన్లు ఎంచుకునే కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఇస్తుంది. 

 

అయితే ఎన్‌సీఎఫ్ తగ్గటం వల్ల కేవలం రూ.130కే అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ వస్తాయి. ఈ ఛానెల్స్ కు అదనంగా చూడాలనుకునే ఛానళ్లకు అదనంగా మరింత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో యూజర్లు రూ.130 చెల్లిస్తే 200 ఛానళ్లు వస్తాయి. యూజర్లు రెండో కనెక్షన్ తీసుకుంటే అప్పుడు దీనికి ఎన్‌సీఎఫ్‌లో గరిష్టంగా 40 శాతం చెల్లిస్తే సరిపోతుంది. 

 

ఆరు లేదా అంతకన్నా ఎక్కువ వాలిడిటీ ఉన్న ప్లాన్లు ఎంచుకుంటే ఆపరేట్లు యూజర్లకు మరిన్ని ఆఫర్లు అందిస్తుంది. అయితే మార్చి 1 నుండి ఈ కొత్త నిర్ణయాలు అమలులోకి వస్తాయి. గతంలో 230 రూపాయలకు కేవలం 100 ఛానల్స్ మాత్రమే వచ్చేవి ఇప్పుడు 200 ఛానల్స్ వస్తున్నాయి. ఈ కొత్త నిర్ణయాలు అన్ని మరో రెండు నెలల్లో అంటే మర్చి 1 నుండి అమలు అవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: