ఔను.. ఇది నిజంగా మోడీ మనసు పులకరించే వార్తే.. ఎందుకంటే దేశం ఆర్థికంగా వెనక్కు వెళ్తోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్న సమయంలో ఆయనకు ఓ శుభవార్త వినిపిస్తోంది. అదేమింటంటే.. వస్తు-సేవల పన్ను వసూళ్లు వరుసగా రెండో నెలలోనూ లక్ష కోట్ల రూపాయలు దాటాయి.

 

డిసెంబర్ నెలలో ఒక లక్షా 3వేల కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలయ్యింది. 2018 డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు 97వేల 276 కోట్లు ఉన్నాయి. 2019 డిసెంబర్ లో లక్ష కోట్ల రూపాయలు దాటింది. 2019 నవంబర్ లో కూడా జీఎస్టీ ఒక లక్షా మూడు వేల 492 కోట్ల రూపాయలు వసూలయ్యింది.

 

2019 ఏడాది డిసెంబర్ లో వసూలైన జీఎస్టీ జీఎస్టీ కేంద్ర జీఎస్టీ 19వేల 962 కోట్ల రూపాయలు ఉన్నాయి. రాష్ట్ర జీఎస్టీ 26వేల 792 కోట్ల రూపాయలు, సమ్మిళిత జీఎస్టీ 48వేల 99 కోట్ల రూపాయలు, సెస్సు 8వేల 331 కోట్ల రూపాయలు ఉంది. 2018 డిసెంబర్ తో పోలిస్తే దేశీయ లావాదేవీల మీద వసూలైన జీఎస్టీలో 2019 డిసెంబర్ లో 16శాతం వృద్ధి నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: