జనవరి వచ్చిందంటే.. బడ్జెట్ ఊహాగానాలు మొదలవుతాయి. ఈసారి ఏ వర్గాలను ఆర్థిక మంత్రి కరుణించే అవకాశం.. ఉంది.. ఎవరిపై వడ్డన ఉంటుంది.. అనే అంశాలు చర్చకు వస్తాయి. అయితే సాధారణంగా ఏటా బడ్జెట్ కోసం వేతన జీవులు ఆశగా చూసే అంశం మాత్రం ఒక్కటే. అదే పన్ను ఊరట అంశం.

 

ఆదాయ పన్ను పరిమితిని పెంచుతారా లేదా అన్న విషయం వేతన జీవులకు కీలకంగా మారుతుంది. తాము పన్ను పరిథిలోకి వస్తామా రామా.. ఏమైనా ఊరట ఉందా అని లెక్కలు వేసుకుంటారు.అయితే ఈసారి వేతన జీవులకు కూడా మేలు కలిగించేలా బడ్జెట్లో చర్యలుంటాయని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా సామాన్యులు శుభవార్తలు కోసం నిర్మల సీతారామన్ వైపు చూస్తున్నారు. అయితే.. కార్పొరేట్ పన్నులను ప్రభుత్వం బడ్జెట్ లో తగ్గించే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

 

ఇప్పటికే కార్పొరేట్ పన్నుల మినహాయింపు ఖజానా పై 1.45 లక్షల కోట్ల భారం పడింది. అందుకే ఇప్పుడు ఈ భారాన్ని మరింత పెంచుకోవడానికి సర్కార్ ప్రయత్నించకపోవచ్చని వారి అంచనా. ఇక సామాన్యులకు సంబంధించి పీఎఫ్ కంట్రిబ్యూషన్, ఆదాయపు పన్ను రేట్లలో తగ్గింపు ఉండవచ్చని అనుకుంటున్నా, అది ఎంత వరకూ ఉంటుందన్న విషయం అంచనాకు అందడం లేదు.

 

వేతన జీవులకు ఊరట కలిగించేలా సీతారామన్ బడ్జెట్ ఉంటుందా అనేది ప్రశ్నఅర్థకమే అని నిపుణులు చెబుతున్నారు. వారి అంచనా ప్రకారం పెద్దగా ఈ విషయంలోనూ ఊరట కలిగించే అంశాలు ఉండబోవని అనుకుంటున్నారు. అయితే, వేతన జీవులకు పన్ను మినహాయింపు విషయంలో కొద్దిగా ఆలోచన చేయొచ్చని వారు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: