ఈ మధ్యకాలంలో మార్కెట్ లో కొనే కూరగాయల కంటే హోటల్ లో అమ్మే చికెన్ బిర్యానీ ధరే తక్కువ అయ్యింది. అతివృష్టి.. అనావృష్టి వర్షాల కారణంగా పంటలు నాశనం అయ్యి ఉల్లిధరలు.. టమోటో ధరలు కొండెక్కాయి. అయితే ఆ ధరలు అన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా తగ్గుతూ వస్తున్నాయి. 

 

ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ఉల్లిధరలు భారీగా తగ్గాయి. ఆలాంటి ఉల్లి ధరలే తగ్గగా టమోటా తగ్గకుండా ఉంటుందా ? టమోటా కూడా తగ్గుతుంది.. ఈ నేపథ్యంలోనే టమోటా ధరలు భారీగా తగ్గిపోయాయి. తెలంగాణలో గత రెండు నెలల క్రితం అగ్గిమండిన టమోటా ధర తాజాగా పూర్తిగా పడిపోయింది. 

 

కేవలం తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా కర్నాటక, ఏపీ, మహారాష్ట్ర నుంచి భారీగా నగరానికి టమాటా దిగుమతి అవుతోంది. దీంతో ధరలుపూర్తిగా పడిపోయాయి. ధరలు పెరిగిన సమయంలో ఎక్కువ మంది రైతులు టమాటా పంటలు వేశారు. దీంతో తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట తదితర జిల్లాల్లో భారీగా టమాట దిగుబడి వచ్చింది. దీంతో ధరలు బాగా తగ్గాయి. 

 

రెండు నెలల క్రితం రిటైల్‌ మార్కెట్‌లో కిలో టమాటా 40 నుంచి 50రూపాయలు పలికింది. కానీ తాజాగా కిలో టమాటా 10 నుంచి 15 రూపాయలకే అమ్ముతున్నారు. టమాటా ధరలు తగ్గడంతో సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరలు కూడా సాధారణ స్థితికి వచ్చేసి సామాన్యులకు కాస్త ఉపిరినిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: